Sunny Leone : తెలుగు సినిమా ‘త్రిముఖ’లో సన్నీ లియోన్.. పోస్టర్ రిలీజ్..
యోగేష్ కల్లే హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'త్రిముఖ'. ఈ సినిమాలో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తుంది.

Sunny Leone Key Role in Trimukha Movie Sankranthi Poster Released
Sunny Leone : సన్నిలియోన్ ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో కనిపించింది. ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. నటుడు యోగేష్ కల్లే హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘త్రిముఖ’. ఈ సినిమాలో సన్నీ లియోన్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే నాజర్, CID ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషురెడ్డి.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read : Jailer 2 : రజినీకాంత్ జైలర్ 2 టీజర్ వచ్చేసింది.. ఎలివేషన్స్ అదిరిపోయాయిగా..
అకిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హర్ష కల్లే నిర్మాణంలో రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వంలో త్రిముఖ సినిమా తెరకెక్కుతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తికాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా. 2025లోనే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. నేడు సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
త్రిముఖ హీరో యోగేష్ చాణుక్యం, బెజవాడ బాయ్స్ అనే మరో రెండు సినిమాలు చేస్తున్నాడు. చాణుక్యం సినిమాలో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది.