Jailer 2 : రజినీకాంత్ జైలర్ 2 టీజర్ వచ్చేసింది.. ఎలివేషన్స్ అదిరిపోయాయిగా..

రజినీకాంత్ జైలర్ 2 టీజర్ వచ్చేసింది.

Jailer 2 : రజినీకాంత్ జైలర్ 2 టీజర్ వచ్చేసింది.. ఎలివేషన్స్ అదిరిపోయాయిగా..

Superstar Rajinikanth Jailer 2 Teaser Announcement Released

Updated On : January 14, 2025 / 7:56 PM IST

Jailer 2 : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ 70 ఏళ్ళు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రజినీకాంత్ హీరోగా నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గతంలో వచ్చిన జైలర్ సినిమా పెద్ద హిట్ అయింది. కొన్నాళ్లుగా హిట్ కోసం చూస్తున్న రజినీకాంత్ కి ఈ సినిమా గ్రాండ్ కంబ్యాక్ అయింది. ఆల్మోస్ట్ 700 కోట్ల గ్రాస్ వసూలు చేసి పెద్ద హిట్ అయింది.

Also See : Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ సెలెబ్రేషన్స్.. ఫోటోలు చూశారా?

జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ.. ఇలా చాలా మంది స్టార్స్ తో రజినీకాంత్ కి ఎలివేషన్స్ ఇస్తూ జైలర్ సినిమాని అదరగొట్టారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో గతంలోనే సీక్వెల్ అనౌన్స్ చేశారు. తాజాగా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లోనే రజినీకాంత్ కి అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. మీరు కూడా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ చూసేయండి..

 

టీజర్ లో.. అనిరుధ్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ సినిమా నాగురించి చర్చించుకుంటుండగా రజినీకాంత్ కొంతమందిని చంపుతూ లోపలికి వస్తాడు. జైలర్ సినిమాలో రజినీకాంత్ జస్ట్ అలా నడిచి వస్తుంటే కూడా అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. చివర్లో జైలర్ సినిమా ఫేమస్ డైలాగ్ ‘టైగర్ కా హుకుం’ అని అలరించారు సూపర్ స్టార్. ఇప్పుడు జైలర్ 2 టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కూడా ఎలివేషన్స్ భారీగానే ఉండబోతున్నాయని తెలుస్తుంది.

Also Read : Bhairavam : ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్.. భారీ మల్టీస్టారర్ ‘భైరవం’.. సంక్రాంతి స్పెషల్ పోస్టర్..

ఇక జైలర్ 2లో బాలకృష్ణ గెస్ట్ అప్పీరెన్స్ ఉండబోతుందని సమాచారం. గతంలో జైలర్ లో అనుకున్నా కుదరలేదని డైరెక్టర్ చెప్పారు. దీంతో ఈ సినిమాలో కచ్చితంగా బాలయ్య బాబు ఉంటాడని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. 2025 లోనే జైలర్ 2 రిలీజ్ కానుంది. ఇటీవల రజినీకాంత్ వెట్టయాన్ సినిమాతో రాగా అది యావరేజ్ గా నిలిచింది. త్వరలో లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో కూలీ సినిమాతో రానున్నాడు. ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ చేస్తున్నాడు.