Bhairavam : ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్.. భారీ మల్టీస్టారర్ ‘భైరవం’.. సంక్రాంతి స్పెషల్ పోస్టర్..

తాజాగా నేడు సంక్రాంతి సందర్భంగా భైరవం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Bhairavam : ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్.. భారీ మల్టీస్టారర్ ‘భైరవం’.. సంక్రాంతి స్పెషల్ పోస్టర్..

Bellamkonda Sreenivas Manchu Manoj Nara Rohith Bhairavam Movie Sankranthi Special Poster

Updated On : January 14, 2025 / 5:09 PM IST

Bhairavam Movie : ఒకప్పుడు సీనియర్ హీరోలు మల్టీస్టారర్స్ చేయగా ఇటీవల యువ హీరోలు మల్టీస్టారర్లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు మల్టీస్టారర్లు రాగా త్వరలో మరో సినిమా రాబోతుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముగ్గురు కలిసి సినిమా భైరవం అనే సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ముగ్గురు హీరోల పోస్టర్స్, ఒక సాంగ్ రిలీజ్ చేసారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కూడా ఉన్నారు.

Also See : Anasuya Bharadwaj : చీరకట్టులో అనసూయ సంక్రాంతి స్పెషల్ ఫోటోలు చూశారా? ఎంత క్యూట్ గా ఉందో..

తాజాగా నేడు సంక్రాంతి సందర్భంగా భైరవం సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో ముగ్గురు హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తో పాటు ముగ్గురు హీరోయిన్స్ ఆనంది, అదితి శంకర్, దివ్య పిళ్ళై లు కూడా ఉన్నారు. అలాగే సీనియర్ నటి జయసుధ కూడా ఉంది. నారా రోహిత్ కి జంటగా దివ్య పిళ్ళై, శ్రీనివాస్ జోడిగా అదితి శంకర్, మనోజ్ జోడిగా ఆనంది నటిస్తున్నారు.

Bellamkonda Sreenivas Manchu Manoj Nara Rohith Bhairavam Movie Sankranthi Special Poster

ఈ పోస్టర్ చూస్తుంటే జయసుధ ముగ్గురు కొడుకులు అని, ఈ ముగ్గురు అన్నదమ్ములుగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ తో మాస్ యాక్షన్ సినిమా అనుకుంటే ఈ పోస్టర్ తో ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాని అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం.. లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తీసిన విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ‘భైరవం’ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Also See : Deepthi Sunaina : గాలిపటాలు ఎగరేస్తూ సంక్రాంతి ఎంజాయ్ చేస్తున్న దీప్తి సునైనా.. ఫోటోలు చూశారా?

త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. మంచు మనోజ్ కంబ్యాక్ సినిమా ఇదే అవ్వనుంది. మరి ముగ్గురు హీరోలు కలిసి ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాలి. మొత్తానికి ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్స్ తో సంక్రాంతి స్పెషల్ పోస్టర్ తో భైరవం సినిమాపై ఆసక్తి నెలకొంది.