Sankranthiki Vasthunam : విక్ట‌రీ వెంక‌టేష్ ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ట్విట‌ర్‌ రివ్యూ

విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.

Venkatesh Sankranthiki Vasthunam twitter review

విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వ‌హించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిచారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన పాట‌లకు మంచి స్పంద‌న రావ‌డంతో చిత్రంపై అంచ‌నాల‌ను పెంచేసింది.

భారీ అంచ‌నాల మ‌ధ్య సంక్రాంతి రోజున ఈ చిత్రం నేడు (జ‌న‌వ‌రి 14న‌) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఫెవరెట్ హీరో వెంకీ మామ సినిమా ఇప్ప‌టికే చాలా చోట్ల ఫ‌స్ట్ షో ప‌డిపోయింది. సినిమా చూసిన త‌రువాత ప్రేక్ష‌కులు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేస్తున్నారు. వాటిపై ఓ లుక్కు వేద్దాం.

Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ రివ్యూ.. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్.. ఫ్యాన్స్ కు యాక్షన్ ఫీస్ట్..

కుటుంబంతో క‌లిసి చూసే చిత్రం అని చెబుతున్నారు. బుల్లి రాజు పాత్రలో వెంకీ న‌టన అదుర్స్ అని అంటున్నారు. ‘గోదారి గట్టు’ సాంగ్ థియేటర్ లలో ఇంకా చాలా బాగుందని అంటున్నారు.