Sankranthiki Vasthunnam : ఓటీటీ కంటే ముందే టీవీలోకి వచ్చేస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఎందుకో తెలుసా?

ఓటీటీ వచ్చిన తర్వాత చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో రిలీజయిన మూడు నాలుగు వారాలకే ఓటీటీలు వస్తున్నాయి.

Venkatesh Sankranthiki Vasthunnam Movie Telecast in tv before OTT Streaming Here Details

Sankranthiki Vasthunnam : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా, vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జనవరి 14న థియేటర్స్ లో రిలీజయి భారీ హిట్ అయింది.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా కేవలం 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా ఏకంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ విజయం సాధించి ఫుల్ ప్రాఫిట్స్ తెచ్చుకుంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు పలు సక్సెస్ మీట్స్ నిర్వహించారు. ఫ్యామిలీలకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని పలువురు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలోకి రాకుండా డైరెక్ట్ టీవీ లోకి వచ్చేస్తుంది.

Also Read : Prabhas Sisters : ట్రెడిషినల్ గా ప్రభాస్ ముగ్గురు చెల్లెల్లు.. తల్లితో కలిసి.. ఫోటోలు వైరల్..

ఓటీటీ వచ్చిన తర్వాత చాలా వరకు సినిమాలు థియేటర్స్ లో రిలీజయిన మూడు నాలుగు వారాలకే ఓటీటీలు వస్తున్నాయి. కొన్ని సిన్మాలు అయితే ఓటీటీతో ఒప్పందాలు అయ్యాకే థియేటర్స్ కి వస్తున్నాయి. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రం ఓటీటీ ఒప్పందం అవ్వకుండానే రిలీజయింది. దీంతో అంతా దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడు అనుకున్నారు. కానీ బోలెడు ప్రాఫిట్స్ థియేటర్ నుంచే వచ్చాయి. థియేటర్స్ లో రిలీజయి పెద్ద హిట్ అయ్యాక సంక్రాంతికి వస్తున్నాం సినిమా శాటిలైట్, ఓటీటీ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడగా జీ సంస్థ రెండు హక్కులను కొనేసుకుంది.

Also Read : Udaya Bhanu Daughters : థ్యాంక్యూ బాలయ్య మామ.. ఉదయభాను పిల్లలు ఎంత క్యూట్ గా చెప్పారో.. బ్రాహ్మణి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వడంతో..

సంక్రాంతికి వస్తున్నాం శాటిలైట్, ఓటీటీ హక్కులను జీ సంస్థ కొనుక్కోటంతో జీ5 ఓటీటీలోకి సినిమా వచ్చే ముందే జీ తెలుగు ఛానల్ లో సినిమాని టెలికాస్ట్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఓటీటీలో వచ్చే వ్యూస్ ఎలాగూ వస్తాయి. టీవీలో ముందే వేస్తే ఎక్కువ యాడ్స్ తెచ్చుకోవచ్చు, ఎక్కువ టీఆర్పీ తెచ్చుకోవచ్చు అని జీ సంస్థ ఆలోచించినట్టు తెలుస్తుంది. శాటిలైట్, ఓటీటీ వేరు వేరు సంస్థలు కొనుక్కుంటే ఇలా కుదిరేది కాదు కానీ రెండిటిని ఒకే సంస్థ కొనుక్కోవడంతో మరింత క్యాష్ చేసుకోడానికి, తమ ఛానల్ కి రీచ్ తెచ్చుకోవడానికి ముందే టీవీలో వేస్తున్నారు. అయితే జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ చేస్తున్నామని ప్రకటించారు కానీ ఎప్పుడు వేస్తారో ఇంకా అధికారికంగా చెప్పలేదు. టాలీవుడ్ సమాచారం ప్రకారం శివరాత్రికి వేయొచ్చు అని తెలుస్తుంది. ఆ తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వనుంది ఈ సినిమా.