Bobbili Raja : వంద పాములతో ఆ సీన్ చేశాను.. బొబ్బిలిరాజా సినిమా గురించి బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..
వెంకీమామ చేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాల గురించి కూడా షోలో మాట్లాడారు.

Venkatesh Talks About Bobbili Raja Movie in Balakrishna Show
Bobbili Raja – Venkatesh : తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వెంకటేష్ వచ్చిన ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. బాలయ్య, వెంకీమామ కలిసి షోలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. వెంకటేష్ అనేక ఆసక్తికర విషయాలు షోలో తెలిపారు. వెంకీమామ చేసిన కొన్ని సూపర్ హిట్ సినిమాల గురించి కూడా షోలో మాట్లాడారు.
ఈ క్రమంలో బొబ్బిలి రాజా సినిమాలో కొండచిలువని పట్టుకున్న ఒక ఫోటో చూపించి.. ఆ సినిమాలో అప్పట్లోనే యానిమేషన్స్ తో సాంగ్స్, రియల్ జంతువులతో సీన్స్ చేసి చాలా కష్టపడ్డారు. బాంబే హీరోయిన్ ని రప్పించి భారీ బడ్జెట్ తో తీశారు అని ఆ సినిమా గురించి అడిగారు బాలయ్య.
Also Read : Venkatesh : మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ కు నాకు అదే కనెక్ట్ అయింది.. బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..
వెంకటేష్ మాట్లాడుతూ.. ఆ సినిమా అంటే మా అన్నయ్యకు కూడా చాలా ఇష్టం. ఆ సినిమాలో వంద పాములతో సీన్ చేశాను. ఓ హాలీవుడ్ సినిమా నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం. నేను చెయ్యలేనేమో అని భయపడి రూమ్ లోకి వెళ్ళిపోయాను. కానీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ వచ్చి ఆ పాములు ఉన్న రూమ్ లో దూకేసాను. కెమెరాలు దూరంగా పెట్టుకున్నారు. ఆ పాములతను వచ్చి పాములు నా మీద వేశారు అదో గ్రేట్ అనుభవం అంటూ ఆ సినిమా గురించి చెప్పారు.
బి. గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్, దివ్యభారతి జంటగా బొబ్బిలిరాజా సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయి ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాలో రియల్ జంతువులతో అడవుల్లో చాలానే ప్రయోగాలు చేశారు. అలా విషం తీసేసిన 100 పాములు, కొండచిలువలతో ఆ సీన్ చేశారు వెంకటేష్.
ఇక వెంకటేష్ సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ వచ్చి పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.