Venkatesh : మహేష్ నా చిన్న తమ్ముడు.. పవన్ కు నాకు అదే కనెక్ట్ అయింది.. బాలయ్య షోలో వెంకటేష్ కామెంట్స్..
వెంకటేష్ గతంలో మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

Venkatesh Comments on Pawan Kalyan and Mahesh Babu in Balakrishna Unstoppable Show
Venkatesh – Pawan Kalyan – Mahesh Babu : విక్టరీ వెంకటేష్ తాజాగా బాలకృష్ణ షో అన్‌స్టాపబుల్ కి వచ్చి సందడి చేశారు. వెంకటేష్ వచ్చిన ఎపిసోడ్ ఆహా ఓటీటీలో నేడు రిలీజయింది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ వైరల్ గా మారింది. ఇద్దరు స్టార్ హీరోలు ఒక షోలో వచ్చి ఇంటర్వ్యూలాగా బాలయ్య వెంకీమామను ప్రశ్నలు అడగడంతో ఈ ఎపిసోడ్ పై అందరికి ఆసక్తి నెలకొంది.
ఈ ఎపిసోడ్ లో వెంకటేష్ అనేక అంశాల గురించి మాట్లాడారు. వెంకటేష్ గతంలో మహేష్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు మంచి హిట్స్ అయ్యాయి. బాలయ్య ఈ సినిమాల ప్రస్తావన తెచ్చి పవన్, మహేష్ గురించి అడిగారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో వెంకటేష్.. మహేష్ బాబుని పూలకుండీ ఎందుకు తన్నావురా అనే ఐకానిక్ సీన్ ని చూపించి మహేష్ గురించి అడిగారు. దీనికి వెంకటేష్.. ఇటీవలే మెసేజ్ కూడా చేశాను పూలకుండీ ఎందుకు తన్నావు అని కానీ రిప్లై ఇవ్వలేదు. మహేష్ అందరికి గౌరవం ఇస్తాడు. ఒకరికొకరు బాగా దగ్గరయ్యాం ఆ సినిమా సమయంలో. నిజమైన అన్నదమ్ముల్లాగే చేశాము. ఇప్పుడు కూడా కలవకపోయినా ఎప్పుడన్నా కలిస్తే నా చిన్న తమ్ముడిలా అనిపిస్తాడు అని తెలిపాడు.
Venkatesh : నాకు ఎనిమిది మంది పిల్లలు.. అందరూ ఒకటే నాకు.. ఎవరెవరంటే..
ఇక పవన్ గురించి అడగ్గా.. సినిమాల కంటే ముందే పవన్ తో పరిచయం ఉంది. మా ఇంటికి వచ్చేవాడు. నా దగ్గర లేజర్ డిస్క్ లు ఉండేవి వాటి కోసం ఎక్కువగా వచ్చేవాడు. మేమిద్దరం భక్తి భావంతో కనెక్ట్ అయ్యాం. ఇద్దరికీ భక్తి ఎక్కువ. ఇద్దరం ఎక్కువ సైలెంట్ గా ఉంటాము. ఆ సైలెంట్ లోనే ఒకరికొకరు అర్ధం చేసుకుంటాం అని అన్నారు. దీంతో వెంకీమామ పవన్, మహేష్ లపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.