Venkatesh : నాకు ఎనిమిది మంది పిల్లలు.. అందరూ ఒకటే నాకు.. ఎవరెవరంటే..
మీరంతా ఉమ్మడి కుటుంబంలా ఉంటారు అని పిల్లల గురించి బాలకృష్ణ అడగ్గా వెంకటేష్ మాట్లాడుతూ..

Venkatesh says he has eight children in Balakrishna Aha Show comments goes viral
Venkatesh : తాజాగా ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోకి వెంకటేష్ వచ్చారు. సీజన్ 4లో ఏడో ఎపిసోడ్ గా ఈ ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ తో పాటు అనిల్ రావిపూడి, సురేష్ బాబు, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వచ్చి అలరించారు. ప్రస్తుతం బాలయ్య – వెంకటేష్ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో దూసుకుపోతుంది.
Also Read : Venkatesh : హీరో అవ్వకపోతే వెంకటేష్ ఏం అవుదామనుకున్నాడో తెలుసా? బాలయ్య షోలో తన ప్లాన్స్ చెప్పిన వెంకటేష్..
ఇక ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ అనేక అంశాల గురించి అడగ్గా వెంకటేష్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో తన ఫ్యామిలీకి చెందిన వాళ్ళతో దిగిన ఫొటోలు చూపించి అందరి గురించి అడిగారు. వెంకటేష్ భార్య, పిల్లలు, రానా, చైతు, సురేష్ బాబు.. వీళ్ళతో దిగిన ఫోటోలను చూపించి వారి గురించి మాట్లాడించాడు బాలయ్య.
అయితే ఈ క్రమంలో మీరంతా ఉమ్మడి కుటుంబంలా ఉంటారు అని పిల్లల గురించి బాలకృష్ణ అడగ్గా వెంకటేష్ మాట్లాడుతూ.. నాకు ఎనిమిది మంది పిల్లలు. నా పిల్లలతో పాటు అన్నయ్య పిల్లలు కూడా. రానా, మాళవిక, అభిరామ్, హవ్య, భావన, ఆశ్రిత, అర్జున్, చైతూ.. మొత్తం ఎనిమిది మంది పిల్లలు. ఈ ఎనిమిది మందిని నా పిల్లల్లాగే భావిస్తాను. ఏం చేసినా అందరికి చేస్తాను అని అన్నారు.
దీంతో వెంకటేష్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ఈ విషయంలో వెంకిమామను అభినందిస్తున్నారు. తన పిల్లలు, అన్నయ్య పిల్లలు గురించి చెప్పి తన మేనల్లుడు నాగచైతన్య కూడా తన బిడ్డలాంటి వాడని, అంతా ఒకటే కుటుంబం అని చెప్పడంతో అందుకే కదా వెంకిమామ అంటే అందరికి ఇష్టం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రిలీజ్ కానుంది.