Venkatesh : హీరో అవ్వకపోతే వెంకటేష్ ఏం అవుదామనుకున్నాడో తెలుసా? బాలయ్య షోలో తన ప్లాన్స్ చెప్పిన వెంకటేష్..
బాలకృష్ణ అసలు నువ్వు హీరో అవ్వకపోతే ఏం అయ్యేవాడివి, నువ్వేం చెయ్యాలనుకున్నావు అని అడిగారు.

Venkatesh tells about his Plans if he didnt become Hero in Balakrishna Unstoppable Show
Venkatesh : ఆహా ఓటీటీలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగో సీజన్ లో ఆరు ఎపిసోడ్స్ అవ్వగా ఏడో ఎపిసోడ్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ కి వెంకటేష్ వచ్చి సందడి చేశారు. వెంకిమామ, బాలకృష్ణ ఇద్దరూ సీనియర్ హీరోలు కలిసి కనపడటంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Dream Catcher : ‘డ్రీమ్ క్యాచర్’ ట్రైలర్ చూశారా? కలల మీద సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
ఇక ఈ ఎపిసోడ్ లో వెంకటేష్ సినిమాల గురించి, తన ఫ్యామిలీ గురించి, నాన్న గురించి, తన పిల్లల గురించి మాట్లాడారు. అయితే వెంకటేష్ ఫారెన్ లో చదువుకొని వచ్చి హీరో అయిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ అసలు నువ్వు హీరో అవ్వకపోతే ఏం అయ్యేవాడివి, నువ్వేం చెయ్యాలనుకున్నావు అని అడిగారు.
దీనికి వెంకటేష్ సమాధానమిస్తూ.. నాకు ఫారెన్ వెళ్ళాలి, తిరగలి అని ఉండేది. క్యాలిఫోర్నియాలో బీచ్ సైడ్ ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోవాలి అనుకున్నాను. కానీ కుదరక ఇక్కడికి వచ్చి ఒక బిజినెస్ పెట్టాను. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత ఒకసారి నాన్న గారే రాఘవేంద్రరావు గారిని ఇలా మా వాడు ఉన్నాడు అని అడిగితే అలా కలియుగ పాండవులు సినిమా చేశాను. సరే ఇది కూడా ఒక ట్రయిల్ వేద్దామని సినిమాలు మొదలుపెట్టాను అని తెలిపారు.
Also Read : Bigg Boss Adi Reddy : మళ్ళీ స్టూడెంట్ గా మారిన ఆదిరెడ్డి.. త్వరలో లాయర్ కాబోతున్న బిగ్ బాస్ ఆదిరెడ్డి..
ఇక వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. వీరు కూడా ఈ షోకి వచ్చారు. వెంకటేష్ అన్నయ్య, నిర్మాత సురేష్ బాబు కూడా షోకి వచ్చి సందడి చేశారు.