Bigg Boss Adi Reddy : మళ్ళీ స్టూడెంట్ గా మారిన ఆదిరెడ్డి.. త్వరలో లాయర్ కాబోతున్న బిగ్ బాస్ ఆదిరెడ్డి..
కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Bigg Boss Fame Adi Reddy Turned as Law Student Joined in College
Bigg Boss Adi Reddy : చాలా మంది చదువుకోవాల్సిన వయసులో బాధ్యతల వల్లో, వేరే కారణాలతో చదువుకోకపోతే తర్వాత ఏజ్ పెరిగినా కూడా చదువు మీద ఇంట్రెస్ట్ తో చదువుకుంటారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి కూడా చేరాడు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఒక చిన్న కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సినిమాలు, క్రికెట్, సోషల్ ఇన్సిడెంట్స్ పై వీడియోలు చేసిన ఆది ఆ తర్వాత రియాలిటీ షో బిగ్‌బాస్‌పై వీడియోలు చేయడంతో అవి వైరల్ గా మారాయి. దీంతో బిగ్ బాస్ 6వ సీజన్‌లో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి ఫైనల్ వరకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఆ పేరుతో బాగానే పాపులారిటీ, డబ్బు సంపాదించుకున్నాడు.
పలు టీవీ షోలలో కనిపిస్తూ, ఓ సెలూన్ కూడా ఓపెన్ చేసి బిజినెస్ చేసుకుంటూనే ప్రతి సీజన్ బిగ్ బాస్ రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు ఆదిరెడ్డి. అయితే తాజాగా ఆదిరెడ్డి మళ్ళీ స్టూడెంట్ గా మారాడు. ఈ విషయాన్ని ఆదిరెడ్డి అధికారికంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తను లా చదవబోతున్నట్టు, లాయర్ అవ్వడం తన డ్రీం అన్నట్టు, ఆల్రెడీ లా కాలేజీలో చేరినట్టు తెలిపాడు ఆదిరెడ్డి. నెల్లూరులోని VR లా కాలేజీలో ఆదిరెడ్డి చేరినట్టు తెలుస్తుంది.
దీంతో అంతా ఆదిరెడ్డిని అభినందిస్తున్నారు. ఏమి లేకుండా మొదలుపెట్టి కావాల్సినవి అన్ని సంపాదించి ఇప్పుడు తనకు నచ్చింది చదువుకుంటున్నాడు అంటూ పొగుడుతున్నారు. ఈ ఏజ్ లో మళ్ళీ కాలేజీలో చేరి లాయర్ అవ్వాలనే తన ప్రయత్నం సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. పలువురు నెటిజన్లు, సెలబ్రిటీలు అతని వీడియో కింద అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Manmohan Singh : మన్మోహన్ సింగ్ పై సినిమా వచ్చింది తెలుసా? అందులో మన్మోహన్ పాత్రలో ఎవరు నటించారో తెలుసా?
ఇక ఆదిరెడ్డి తనకు నచ్చినట్టు ఇల్లు కట్టుకున్నాడు. తన భార్య, పాప, తల్లితండ్రులతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ కూడా ఆచూసుకుంటున్నాడు. ఆది సోదరి, భార్య కూడా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు.