Sowmya Sharada : ఈ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేస్తే అంతే.. తెలుగు పరిశ్రమపై జబర్దస్త్ యాంకర్ సౌమ్య వ్యాఖ్యలు..

తాజాగా మాజీ జబర్దస్త్ యాంకర్, నటి సౌమ్య శారద తాజాగా తెలుగు పరిశ్రమపై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Sowmya Sharada : ఈ ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేస్తే అంతే.. తెలుగు పరిశ్రమపై జబర్దస్త్ యాంకర్ సౌమ్య వ్యాఖ్యలు..

Jabardasth Anchor Actress Sowmya Sharada Interesting Comments on Telugu TV Industry

Updated On : December 27, 2024 / 5:08 PM IST

Sowmya Sharada : తాజాగా మాజీ జబర్దస్త్ యాంకర్, నటి సౌమ్య శారద తాజాగా తెలుగు పరిశ్రమపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న సౌమ్య జబర్దస్త్ లో కొన్నాళ్ల పాటు యాంకరింగ్ చేసి బాగా ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు, కన్నడ సీరియల్స్, పలు తెలుగు టీవీ షోలతో అలరిస్తుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసింది.

Also Read : Allu Arjun Bail Petition : అల్లు అర్జున్ రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్ పై విచార‌ణ వాయిదా..

సౌమ్య కన్నడ నటి కావడం, షూట్ ఉన్నప్పుడే బెంగుళూరు నుంచి ఇక్కడకు రావడంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ సౌమ్యను.. తెలుగు మిమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా ఇక్కడికి షిఫ్ట్ అవ్వొచ్చు కదా? ఇక్కడే ఒక ఇల్లు తీసుకోవచ్చు కదా అని అడిగారు.

దానికి సౌమ్య శారద సమాధానమిస్తూ.. అయ్యయ్యో ఈ ఇండస్ట్రీని నమ్ముకొని నేను షిఫ్ట్ అయితే అంతే. ఈ ఇండస్ట్రీలో ఇవాళ ఉన్నవాళ్లు రేపు ఉండరు, రేపు ఉండేవాళ్ళు ఎల్లుండి ఉండరు. ఇది పర్మనెంట్ జాబ్ కాదు. ఎప్పుడు ఎవరి పొజిషన్ ఏమైనా అవ్వొచ్చు. దీన్ని నమ్ముకొని మనం వస్తే బాగుండదు. దేవుడి దయవల్ల
అలాంటి ఒక రోజు వస్తే వంద శాతం ఇక్కడే ఉండటానికి ట్రై చేస్తా అని చెప్పింది.

Also Read : Hari Hara Veera Mallu : అభిమానుల‌కు పండ‌గ..! కొత్త ఏడాది ప‌వ‌న్ గాత్రంతో గ్రాండ్ వెల్‌క‌మ్‌..!

దీంతో సౌమ్య వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కొంతమంది ఈ కామెంట్స్ ని నెగిటివ్ గా తీసుకుంటున్నారు. అయితే సౌమ్య ఇక్కడ ఎప్పుడు ఛాన్సులు ఉంటాయో, ఉండవో తెలీదు. అలాంటిది ఇక్కడ ఛాన్సులు వస్తాయని నమ్ముకొని ఇక్కడికి వస్తే కష్టం అన్నట్టు చెప్పింది. ప్రస్తుతానికి అయితే సౌమ్యకు టీవీ షోలు, సీరియల్స్ తో బాగానే పని ఉంది. మరి తర్వాత కూడా ఇక్కడికి షిఫ్ట్ అవుతుందా లేక బెంగుళూరు నుంచే వస్తుందా చూడాలి.