Dream Catcher : ‘డ్రీమ్ క్యాచర్’ ట్రైలర్ చూశారా? కలల మీద సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..
మీరు కూడా డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూసేయండి..

Dream Catcher Trailer Released and Movie Release Date Announced
Dream Catcher : ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్.. పలువురు ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సందీప్ కాకుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ‘డ్రీమ్ క్యాచర్’ సినిమా జనవరి 3న థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ తో పాటు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
Also Read : Bigg Boss Adi Reddy : మళ్ళీ స్టూడెంట్ గా మారిన ఆదిరెడ్డి.. త్వరలో లాయర్ కాబోతున్న బిగ్ బాస్ ఆదిరెడ్డి..
డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూస్తుంటే.. ఓ వ్యక్తికి వచ్చే కలల ఆధారంగా కథ నడుస్తుందని, అతనికి వచ్చే కలల వల్ల అతను, అతని చుట్టూ ఉండేవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసారో అని కథ ఉండబోతుంది. మీరు కూడా డ్రీమ్ క్యాచర్ ట్రైలర్ చూసేయండి..
ఈ ఈవెంట్లో యాక్టర్ శ్రీనివాస్ రామిరెడ్డి మాట్లాడుతూ.. మనమంతా జీవితంలో ఏదో ఒక సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ లో స్ట్రక్ అయిపోయి ఉంటాం. ఆ సంఘటన జరిగినప్పుడు మనసులో ఒక సంఘర్షణ మొదలవుతుంది. అలా హీరో జీవితంలో జరిగిన ఓ ఘటన ప్రభావం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అని సినిమాలో ఆసక్తికరంగా మా డైరెక్టర్ సందీప్ తెరకెక్కించాడు అని తెలిపారు.
హీరో ప్రశాంత్ కృష్ణ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం ఈ సినిమాకు ఆడిషన్ ఇచ్చాను. సైకలాజికల్ థ్రిల్లర్ గా సరికొత్త ఎక్సిపీరియన్స్ ఈ సినిమా అందరికీ ఇస్తుంది. ట్రైలర్ చూశాక నేను అడివిశేష్, రానాలా ఉన్నానంటూ కామెంట్స్ వస్తున్నాయి అని అన్నారు.
డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ.. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ డ్రీమ్ క్యాచర్ సినిమా మొదలైంది. హాలీవుడ్ స్థాయిలో తీయాలని అనుకున్నాను. నాకున్న రిసోర్సెస్ లో మొత్తం హైదరాబాద్ లోనే సినిమా తీసాను. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ సినిమా ఎక్కడ షూటింగ్ చేశారని అందరూ అడుగుతున్నారు. కలల నేపథ్యంలో ఇలాంటి సినిమా తెలుగులో ఇప్పటిదాకా రాలేదు. గంటన్నర నిడివితోనే పాటలు ఫైట్స్ ఏమి లేకుండా కథ మీదే సినిమా వెళ్తుంది అని తెలిపారు.