Vennela Kishore Chaari 111 Trailer Released
Chaari 111 Trailer : కమెడియన్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న వెన్నెల కిషోర్(Vennela Kishore) ఇప్పుడు హీరోగా చారి 111 అనే సినిమాతో రాబోతున్నాడు. గతంలో ఆల్రెడీ ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి ఆసక్తి పెంచగా తాజాగా చారి 111 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఓ వైపు కామెడీగా సాగుతూ మరో వైపు ఆసక్తిగా కూడా ఉంది. ట్రైలర్ చూడగా.. దేశానికి ఓ ఆపద వస్తే సీక్రెట్ ఏజెంట్స్ ని దాన్ని పరిష్కరించడానికి పిలుస్తారు. అందులో చారి కూడా ఉంటాడు. ఒక సీరియస్ ఇష్యూని చారి కామెడీగా ఎలా డీల్ చేసాడు అనేదే కథాంశంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక చారి 111 సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుండగా సత్య, మురళి శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి కుమార్ దర్శకత్వంలో బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. చారి 111 సినిమా మార్చ్ 1న రిలీజ్ కాబోతుంది.