Kumar Shahani : ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కుమార్ షహానీ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. ఆయన మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

Kumar Shahani : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కుమార్ షహానీ కన్నుమూశారు. కోల్‌కతాలోని ఆయన నివాసంలో మరణించినట్లు తెలుస్తోంది. కుమార్ షహానీ మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది.

RC 16 Update : రామ్ చరణ్ – బుచ్చిబాబు సాన RC16 సినిమా కాస్ట్ & క్రూ ఇదే..

బాలీవుడ్ ప్రముఖ దర్శకులు కుమార్ షహానీ మరణించారు. 83 సంవత్సరాల కుమార్ షహానీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో ఆయన కన్నుమూసినట్లు సమాచారం. కుమార్ షహానీ మరణంతో బాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. పలువురు సెలబ్రిటీలు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసారు. కుమార్ షహానీ డైరెక్ట్ చేసిన మాయా దర్పన్, తరంగ్, ఖయల్ గాథ, కస్బా సినిమాలు ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించాయి.

Allu Ayaan : అల్లు అయాన్‌కి రిప్లై ఇచ్చిన షారుఖ్ ఖాన్.. సో స్వీట్ అంటూ బన్నీ..

కుమార్ షహానీ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లర్కానాలో 1940, డిసెంబర్ 7న జన్మించారు. భారతదేశ విభజన తర్వాత షహానీ కుటుంబం ముంబయికి షిఫ్ట్ అయింది. 1972 లో తన మొదటి సినిమా ‘మాయా దర్పణ్‌’ను కుమార్ షహానీ డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత సినిమా ‘తరంగ్’ తీయడానికి 12 సంవత్సరాలు పట్టిందట. కుమార్ షహానీ రచయిత కూడా. “ది షాక్ ఆఫ్ డిజైర్ అండ్ అదర్ ఎస్సేస్” వంటి రచనలతో ప్రశంసలు పొందారు. అనారోగ్య సమస్యల కారణంగా కుమార్ షహానీ ఫిబ్రవరి 24 రాత్రి 11 గంటల సమయంలో మరణించినట్లు తెలుస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు