Chennai : ప్రముఖ సంగీత దర్శకుడు మృతి

ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ కన్నుమూసారు. కన్నడ ఇండస్ట్రీని తన సంగీతంతో శాసించిన విజయ్ తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు సంగీతం అందించి పేరు సంపాదించుకున్నారు.

Chennai

Chennai : ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ చెన్నైలో కన్నుమూశారు. కన్నడ, తమిళ, తెలుగు సినిమాలకు సంగీతం అందించిన విజయ్ ఆనంద్ 71 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణాలతో మరణించినట్లు తెలుస్తోంది.

Tripti Dimri : సూట్‌లో తృప్తి డిమ్రీ టాప్ లెస్ అందాలు..

సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ చెన్నైలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం వ్యక్తం చేశారు. ఇళయరాజా వంటి పెద్ద సంగీత దర్శకుని పోటీని ఎదుర్కుంటూ విజయ్ ఆనంద్ కన్నడ చిత్ర పరిశ్రమలో 100 సినిమాలకు సంగీతం అందించి అక్కడి ఇండస్ట్రీని శాసించారని చెప్పాలి.

Siri Hanumanthu : బ్లాక్ శారీలో సిరి హన్మంతు సోయగాల సిరులు..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘నాన్ అడిమై ఇల్లై’ సినిమా విజయ్‌కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలోని ‘ఒరు జీవన్ దాన్ ఉన్ పాడల్ దాన్’ అనే పాట పాపులర్ అయ్యింది. తమిళలంలో 10 సినిమాలకు విజయ్ సంగీతం అందించారు. విజయ్ ఆనంద్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు.