vetrimaaran said their is no chance for Thalapathy Vijay movie happens
Vijay : ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత హెచ్ వినోద్ దర్శకత్వంలో తన 69వ సినిమాని చేయబోతున్నారు. ఈ రెండింటితో పాటు తమిళ్ మాస్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నారని తమిళనాట వార్తలు వినిపించాయి. ఈ వార్తలను వెట్రిమారన్ కూడా కన్ఫార్మ్ చేస్తూ కామెంట్స్ చేసారు.
ఇక ఈ కామెంట్స్ తో విజయ్ ఫ్యాన్స్ లో భారీ అసలు క్రియేట్ అయ్యాయి. వెట్రిమారన్ వంటి దర్శకుడి డైరెక్షన్ లో విజయ్ సినిమా చేస్తున్నాడంటే.. ఫ్యాన్స్ తో పాటు ఫిలిం మేకర్స్ లో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే వెట్రిమారన్ తన తాజా కామెంట్స్ తో ఆ హైప్ ని ఒక్కసారిగా గంగలో కలిపేశారు. రీసెంట్ గా జరిగిన ఓ తమిళ్ ఈవెంట్ లో వెట్రిమారన్ ని విజయ్ సినిమా గురించి ప్రశ్నించారు.
Also read : Pushpa 2 : పుష్ప 2 ఫస్ట్ సింగల్ ప్రోమో వచ్చేసింది..
దీనికి దర్శకుడు బదులిస్తూ.. “ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ సినిమా జరుగుతుందని అనుకోవడం లేదు” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ తో ఆ మూవీ ఇక లేనట్లే అని తెలియజేయడంతో ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అయితే ఇందుకు కారణం విజయ్ పాలిటిక్స్ అని తెలుస్తుంది. విజయ్ ఇటీవలే తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించి 2026 ఎన్నికలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే.
#Vetrimaaran: I don’t think my film with @actorvijay will happen. pic.twitter.com/wzo9qG10r1
— Rajasekar (@sekartweets) April 23, 2024
ఈ సమయంలో వెట్రిమారన్ తో సినిమా అంటే విజయ్ పొలిటికల్ కాంపెయిన్ కి ఇబ్బంది మారుతుంది. ఎందుకంటే, వెట్రిమారన్ సినిమా అంటే ఎన్నేళ్లు పడుతుందో చెప్పలేము. అది ఎప్పుడు స్టార్ట్ ఎప్పుడు ముగుస్తుందో అనేది వెట్రిమారన్ చేతులో కూడా ఉండదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఇక్కడ రాజమౌళి, పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేయడం ఎంత కష్టమో, అక్కడ వెట్రిమారన్, విజయ్ కలిసి సినిమా చేయడం అంత కష్టం.