Saamrajyam Promo: ‘సామ్రాజ్యం’ టీజర్ వచ్చేసింది.. శింబు అదరగొట్టేశాడు
తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ "సామ్రాజ్యం"(Saamrajyam Promo). తమిళంలో ‘అరసన్’ పేరుతో విడుదల కాబోతోంది.

vetrimaaran-simbu saamrajyam movie intro promo released
Saamrajyam Promo: తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ “సామ్రాజ్యం”. తమిళంలో ‘అరసన్’ పేరుతో విడుదల కాబోతోంది. వడ చేనై సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఇంట్రో ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. దాదాపు ఐదు నిమిషాల పైన ఉన్న ఈ ప్రోమో శింబు పాత్రను పరిచయం చేసినట్లుగా ఉంది. ముగ్గురిని హత్య చేసిన ఒక కేసులో అరెస్ట్ అయిన శింబు తాను(Saamrajyam Promo) ఎందుకు అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని మీడియాకు వివరిస్తున్న సన్నివేశంతో టీజర్ సాగింది. ఇక ఫైనల్ గా జడ్జి నువ్వు హత్య చేశావా అని అడుగగా.. లేదని చెబుతాడు శింబు. ఆతరువాత శింబు అసలు పాత్ర రివీల్ చేశారు. చాలా పవర్ఫుల్ గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక సామ్రాజ్యం టీజర్ ను తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా చూసేయండి.