Bigg Boss 9 Telugu: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్.. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్.. ఈవారం కూడా ఊహించని ఎలిమినేషన్

బిగ్ బాస్ సీజన్ 9 మొదలై అప్పుడే 40 రోజులు గడుస్తోంది. గడిచిన ఐదు వారాలు ఒక ఎత్తు.. వైల్డ్ కార్డు (Bigg Boss 9 Telugu)తరువాత ఒక ఎత్తు అనే రేంజ్ మారిపోయింది ఆట.

Bigg Boss 9 Telugu: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన ఓటింగ్.. డేంజర్ జోన్ లో టాప్ కంటెస్టెంట్.. ఈవారం కూడా ఊహించని ఎలిమినేషన్

Bigg Boss Season 9: Big twist in the sixth week elimination

Updated On : October 17, 2025 / 11:07 AM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 మొదలై అప్పుడే 40 రోజులు గడుస్తోంది. గడిచిన ఐదు వారాలు ఒక ఎత్తు.. వైల్డ్ కార్డు తరువాత(Bigg Boss 9 Telugu) ఒక ఎత్తు అనే రేంజ్ మారిపోయింది ఆట. వైల్డ్ కార్డులో వచ్చిన ఆరుగురు నామినేషన్స్ లో ఇచ్చిన కోటింగ్ కి ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బాధలు, స్నేహాలు, ఎమోషన్స్ పక్కనపెట్టేసి ఆటలో దిగారు కంటెస్టెంట్స్. ఇందులో భాగంగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఒక రేంజ్ లో జరిగింది. నిజానికి చిన్న సైజు యుద్ధమే జరిగింది అని చెప్పాలి. ఈ టాస్కులో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి.

Yellamma: ఇంకా లేట్ చేస్తే మొదటికే మోసం.. వేణుకు అర్థం అవుతుందా.. లేదా..?

ఇక ఈవారం ఎలిమినేషన్ అండ్ వోటింగ్ విషయానికి వస్తే.. నామినేషన్స్ లో తనూజ, భరణి, సుమన్, రాము రాథోడ్, దివ్య, డెమోన్ పవన్ ఉన్నారు. ఎప్పటిలాగానే వోటింగ్ లో తనూజ, సుమన్ శెట్టి టాప్ లో దూసుకుపోతున్నారు. వేళ్ళకి దగ్గరలో కూడా లేరు మిగతా నలుగురు. రెండు రోజుల క్రితం చూసుకుంటే ఫోక్ సింగర్ రాము రాథోడ్, దివ్య డేంజర్ జోన్ లో ఉన్నారు. కానీ, తాజాగా జరిగిన కెప్టెన్సీ టాస్కులో పర్ఫార్మెన్స్ తో రాము రాథోడ్ కి మంచి వోటింగ్ జరిగింది. అలాగే భరణికి కు వోటింగ్ బాగానే పడింది. ఆయన కూడా డేంజర్ జోన్ నుంచి తప్పుకున్నాడు. ఫైనల్ గా శుక్రవారం నాటికీ చూసుకుంటే వోటింగ్ లీస్ట్ లో అనూహ్యంగా డిమాం పవన్, దివ్య ఉన్నారు.

కాబట్టి, గతవారం లాగే ఈవారం కూడా ఊహించని ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో చూసుకుంటే డెమోన్ పవన్ కాస్త బెటర్ ఓటింగ్ తో కనిపిస్తున్నాడు. వెరసి దివ్యనే ఈ ఈవారం ఎలిమినేట్ కానుంది అని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి వరకు వోటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా అనేది చూడాలి.