విశ్వంభర.. మెగా చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఈ మూవీపై చిరుతో పాటు ఆయన అభిమానులకు కూడా భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. విశ్వంభర సినిమా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయింది. అంతా బాగుంటే 2025 జనవరి 10న రిలీజ్ అవ్వాల్సింది. టీజర్ రిలీజ్ లో చూపించిన VFXకు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు.
మూవీలో VFX ఎఫెక్ట్ కూడా అంత బాగా లేవని యూనిట్ అభిప్రాయపడిందట. మెగా ఫ్యాన్స్‌తో పాటు కామన్ ఆడియన్స్‌కు కూడా విశ్వంభర VFX పెద్దగా నచ్చలేదంటున్నారు. దీంతో సినిమా ప్రమోషన్స్‌తో అదరగొట్టాలనుకున్న టీమ్‌కు షాక్ తగిలింది.
VFXపై అలర్ట్ అయిన మెగాస్టార్ మళ్లీ ఫస్ట్ నుంచి రీవర్క్ చేయిస్తున్నారు. దీంతో విశ్వంభర సినిమా వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో క్లారిటీ లేదట. ఈ విషయంలో మెగాస్టార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడంటున్నారు. అంతేకాదు దీని బడ్జెట్ 200 కోట్లు అయితే ఇప్పుడు VFX కోసం అదనపు బడ్జట్ కేటాయించాల్సి వస్తుందట.
దీనిపై కూడా మెగాస్టార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టాక్. అందరూ స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తుండటంతో..విశ్వంభర రిలీజ్ డేట్‌పై కూడా త్వరలోనే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారట. అందుకే VFX వర్క్ త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పాడట చిరు.
Jithender Reddy : ‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ.. 72 తూటాలు శరీరంలోకి దిగిన నాయకుడి బయోపిక్..