Venky75 : వీడియో గ్లింప్స్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన వెంకీ మామ..
వెంకటేష్ తన 75వ సినిమాని శైలేష్ కొలనుతో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీ సంబంధించిన అనౌన్స్‌మెంట్ జనవరి 25న చేయబోతున్నట్లు నిన్న ప్రకటించిన మూవీ టీం.. నేడు మరో పోస్టర్ రిలీజ్ చేసి వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.

venky75
Venky75 : విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 75వ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు అంటూ చాలా చర్చలు జరిగాయి. అయితే ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తాడు అంటూ గట్టిగా వార్తలు వినిపించాయి. వెంకీ మామ కామెడీ టైమింగ్ కి త్రివిక్రమ్ మార్క్ రైటింగ్ తోడైతే థియేటర్ లో నవ్వుల సంబరాలు జరుగుతాయి అని అందరు ఆశ పడ్డారు. కానీ వెంకటేష్ మాత్రం ఒక యంగ్ డైరెక్టర్ కి ఓటు వేశాడు. హిట్ యూనివర్స్ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ తన 75వ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు.
Venkatesh : ‘హిట్’ దర్శకుడితో విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీ..
నిన్న ఈ మూవీని అనౌన్స్ చేస్తూ ఒక పోస్ట్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ ని చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల అనిపిస్తుంది. ఈ బుధవారం సినిమాకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేస్తాము అంటూ నిన్న ప్రకటించిన మూవీ టీం.. నేడు మరో పోస్టర్ రిలీజ్ చేసి వీడియో గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో అసలు మూవీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు షూటింగ్ చేశారు అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ బుధవారం ఉదయం గం.11:07 నిమిషాలకు ఈ గ్లింప్స్ ని రిలీజ్ చేయనున్నారు.
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై వెంకట్ బోయినపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మూవీకి సంబంధించిన మరికొన్ని వివరాలు రేపు తెలిసే అవకాశం ఉంది. కాగా వెంకటేష్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ కావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు శైలేష్ కొలను మెప్పించగలడా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం వెంకటేష్ రానా నాయుడు వెబ్ సిరీస్, సల్మాన్ కిసీకా భాయ్ కిసీకి జాన్ చిత్రంలో నటిస్తున్నాడు.
Get ready folks 🙂 @VenkyMama @NiharikaEnt @vboyanapalli pic.twitter.com/w4I6PQosoo
— Sailesh Kolanu (@KolanuSailesh) January 24, 2023