వెంకటేష్ చేతుల మీదుగా ఫలక్‌నామా దాస్ ట్రైలర్

  • Published By: sekhar ,Published On : May 11, 2019 / 10:41 AM IST
వెంకటేష్ చేతుల మీదుగా ఫలక్‌నామా దాస్ ట్రైలర్

Updated On : May 11, 2019 / 10:41 AM IST

వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న ఫిలిమ్.. ఫలక్‌నామా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. పక్కా హైదరాబాదీ స్టైల్‌లో రూపొందిన ఫలక్‌నామా దాస్ మూవీ టీజర్‌ అండ్ సాంగ్స్‌కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడీ సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చెయ్యడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది మూవీ యూనిట్.

మే 13న విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఫలక్‌నామా దాస్ ట్రైలర్ రిలీజ్ కానుంది. మే 13వ తేదీ ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో, వెంకటేష్ మరియు ఫలక్‌నామా దాస్ ఫ్యాన్స్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ కానుందని మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ పోలీస్ క్యారెక్టర్‌లో నటించగా, ఉత్తేజ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంగీతం : వివేక్ సాగర్, కెమెరా : విద్యా సాగర్, ఎడిటింగ్ : రవితేజ, లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కిట్టు విస్సాప్రగడ.

 వాచ్ టీజర్…