Sankranthiki Vasthunam : విక్ట‌రీ వెంక‌టేష్ కెరీర్‌లోనే అత్య‌ధిక‌ క‌లెక్ష‌న్స్‌.. ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్ ఎంతో తెలుసా?

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం.

Victory Venkatesh Sankranthiki Vasthunam First Day Collections details here

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం. ఈ చిత్రం నిన్న (జ‌న‌వ‌రి 14) సంక్రాంతికి విడుద‌లైంది. వెంకీ, అనిల్ కాంబో వ‌చ్చిన గ‌త చిత్రాలు (ఎఫ్‌2, ఎఫ్ 3) ఘ‌న విజ‌యాలు సాధించ‌డంతో భారీ అంచ‌నాల మ‌ధ్య సంక్రాంతికి వ‌స్తున్నాం మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రం తొలి రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 45 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. పండ‌గ‌కి వ‌చ్చారు.. పండ‌గ‌ని తెచ్చారు అంటూ రాసుకొచ్చింది.

Tollywood directors : ఒకే దారిలో ఆ ముగ్గురు డైరెక్టర్లు.. ఇలా ఉంటే కష్టమే..!

కాగా.. విక్టరీ వెంక‌టేష్ కెరీర్‌లోనే తొలి రోజు అత్య‌ధిక వసూళ్ల‌ను సాధించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. దీంతో వెంకీ మామ అభిమానుల‌తో పాటు చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది.

ఈ చిత్రంలో మీనాక్షి చౌద‌రి, ఐశ్వ‌ర్య రాజేశ్‌లు క‌థానాయిక‌లుగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.

Sankranthi Movies : 2025 సంక్రాంతి అయిపోయింది.. 2026 సంక్రాంతి టార్గెట్.. ఈసారి చిరు – వెంకీ – నాగ్ పోరు..?

ఈ చిత్రం అంద‌రిని క‌డుపుబ్బా న‌వ్వించి మెప్పించింది. బ్లాక్ బాస్ట‌ర్ హిట్ ఇచ్చినందుకు ప్రేక్ష‌కుల‌కు చిత్ర బృందం కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.