Victory Venkatesh Sankranthiki Vasthunam movie enter ento 300 crore club
విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ బాక్సాఫీస్ వద్ద తన దూకుడును కొనసాగిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సంక్రాంతికి కానుకగా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తి కావొస్తున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్ర కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంది. మూడు వందల కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.303 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చిత్ర బృందం తెలియజేసింది. ఓ రీజినల్ ఫిల్మ్ ఈ స్థాయిలో కలెక్షన రాబట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిందని తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది. దీంతో వెంకీ మామ అభిమానులతో పాటు చిత్ర బృందం ఎంతో ఖుషీగా ఉంది.
Kiran Abbavaram : ఇంట్రో వీడియోతోనే ఫుల్ గా నవ్వించిన కిరణ్ అబ్బవరం.. కిరణ్ కొత్త సినిమా అనౌన్స్..
HISTORY HAS A NEW NAME!
LEGACY HAS A NEW BENCHMARK! #SankranthikiVasthunam sets the bar SO HIGH with a RECORD-BREAKING RAMPAGE🔥❤️🔥₹303 CRORE+ worldwide Gross & #BlockbusterSankranthikiVasthunam continues it’s DOMINATION at the box office 💥💥
ALL TIME INDUSTRY HIT FOR A… pic.twitter.com/NA0THATePy
— Sri Venkateswara Creations (@SVC_official) February 3, 2025
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిచారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌లు కథానాయికలు నటించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
Kannappa : రుద్రుడిగా ప్రభాస్.. కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అదిరిందిగా..
ఈ చిత్రం తొలిరోజే రూ.45 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఇప్పటికి కూడా కలెక్షన్లు స్టడీగా ఉండడంతో రానున్న రోజుల్లో ఈ చిత్రం మరిన్ని వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.