Amala Paul : రెండో పెళ్ళికి అమలాపాల్ రెడీ.. బర్త్‌డే రోజు ప్రపోజ్ చేసిన బాయ్‌ఫ్రెండ్

నటి అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. తన 32 వ పుట్టినరోజు నాడు ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరా బాయ్ ఫ్రెండ్?

Amala Paul

Amala Paul : నటి అమలా పాల్ తన నిశ్చితార్ధం వీడియోతో ఒక్కసారిగా మళ్లీ వార్తల్లో నిలిచారు. తన బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‌తో నిశ్చితార్ధం జరిగినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ అమలా పాల్ రెండో పెళ్లి చేసుకోబోతున్న జగత్ దేశాయ్ ఎవరు?

Anil Ravipudi : రాజమౌళి తరువాత అనిల్ రావిపూడినే.. సినిమా హిట్స్ పరంగానే కాదు..!

నటిగా అమలా పాల్ ఎంత ఫేమస్సో.. తన పెళ్లి విషయంలో జరిగిన వివాదాల కారణంగానూ అంతే ఫేమస్. గతంలో పెళ్లై విడాకులు తీసుకున్న అమలా పాల్ రెండో పెళ్లికి సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. తన 32 వ బర్త్ డే రోజు ఆమె బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్ ఆమెకు ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.  జగత్ దేశాయ్ ఆమెకు నేలపై కూర్చుని ప్రపోజ్ చేయడమే కాదు .. వేలికి రింగ్ తొడిగాడు. వెంటనే అమలా అతనికి ముద్దిచ్చింది. ‘ నా జిప్సీ క్వీన్ ఎస్ అంది’ అనే శీర్షికతో జగత్ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో (j_desaii) షేర్ చేసాడు. దాంతో ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

అమలా పాల్ 2014 లో డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విభేదాల కారణంగా 2017 లో విడిపోయారు. 2018 లో అమలాపాల్ తన స్నేహితుడు, సింగర్ భవీందర్ సింగ్‌ను పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరికి పెళ్లి జరిగినట్లు ఓ ఫోటో కూడా మీడియాల్లో చక్కెర్లు కొట్టింది. అదంతా ఓ షూట్‌లో భాగమని అమలా పాల్ కొట్టి పారేసారు. ఆ తర్వాత వ్యాపారంలో వచ్చిన విభేదాలతో భవీందర్ సింగ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు అమలా పాల్. ఇక జగత్ దేశాయ్‌తో నిశ్చితార్ధంతో అమలా పాల్ పెళ్లి వార్త వైరల్ అవుతోంది.

Nikhil Siddhartha : ‘స్పై’ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే రిలీజ్ చేశారు.. నిఖిల్ అసహనం..

అమలా పాల్, జగత్ దేశాయ్‌లు కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గుజరాత్‌కి చెందిన జగత్ దేశాయ్ జిమ్‌లో ఔత్సాహికుడు. అలాగే డాగ్ లవర్ కూడా. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌‌గా ఉండే జగత్ దేశాయ్ అమలా పాల్‌ను ప్రేమలో పడేసినట్లు తెలుస్తోంది. వృత్తిపరంగా అమలా పాల్ బిజీగానే ఉన్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌లో వచ్చిన యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘భోలా’లో కనిపించి మెప్పించారు.