MM Keeravaani : అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి.. అనుపమ్ ఖేర్‌ని ఏడిపించిన కీరవాణి

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్‌ని ఏడిపించేసారు. అసలు ఇద్దరు ఎక్కడికి వెళ్లారు? ఏం జరిగింది?

MM Keeravaani

MM Keeravaani : ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి.. బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ హైదరాబాద్‌లో కలిసారు. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లారు? అనుపమ్ ఖేర్ మాత్రం ఏడుస్తున్నట్లు ఫోజ్ పెట్టారు? అసలు కీరవాణి అనుపమ్ ఖేర్‌ను ఎక్కడికి తీసుకెళ్లారు? సోషల్ మీడియాలో వీళ్లిద్దరి వీడియో వైరల్ అవుతోంది.

Bezawada Prasanna Kumar : ఇండస్ట్రీలో అనసూయ ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ తెలీదు..ఆసక్తికర విషయాలు బయటపెట్టిన రైటర్

ఆస్కార్ విన్నర్ కీరవాణి, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇద్దరూ హైదరాబాద్‌లో కలిసారు. ఫ్రెంచ్ టోస్ట్ తిందామంటూ కీరవాణి ..అనుపమ్ ఖేర్‌ను ఓ రెస్టారెంట్‌కి తీసుకువెళ్లారు. గతంలో కూడా ఇద్దరూ ఆ రెస్టారెంట్‌కి వెళ్లారట. ఇద్దరూ లోపలికి వెళ్లిన తర్వాత రెస్టారెంట్ మూసేసారని తెలిసింది. అంతే.. అనుపమ్ ఖేర్ ఏడుపు ముఖం పెట్టారు. కీరవాణి ఇంకో రెస్టారెంట్‌కి వెళ్దాం అనడంతో ఇద్దరు బయటకు నడిచారు. వారితో సెల్ఫీలు దిగడానికి అక్కడ ఉన్నవారు వెంట పడ్డారు. ఇక కీరవాణి ‘పూరీ.. ఇడ్లీ తిందామా?’ అని అనుపమ్ ఖేర్‌ని అడిగారు. అందుకు అనుపమ్ ఖేర్ ‘నో.. ఫ్రెంచ్ టోస్ట్ తిందాం’ అనడంతో ఇద్దరూ ఇంకో రెస్టారెంట్ వైపు నడిచారు. ఇదంతా అనుపమ్ ఖేర్ షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది.

Rakul Preet Singh : ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్

వీరిద్దరు ఏ సందర్భంలో కలిసారో తెలియదు కానీ మంచి స్నేహితులు అని మాత్రం ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది. కీరవాణి ఇటీవలే ‘నా సామిరంగ’ సినిమాకి మ్యూజిక్ అందించారు. ‘హరిహరవీరమల్లు’ సినిమాకు సంగీతం అందించే పనిలో ఉన్నారు. అనుపమ్ ఖేర్ కాగజ్2, ది ఇండియన్ హౌస్, మెట్రో ఇన్ డినో సినిమాల్లో నటిస్తున్నారు.