Rakul Preet Singh : ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఫైనల్లీ ఒక్కటయ్యారు. గోవాలో వీరి పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు వీరి వివాహానికి తరలి వెళ్లారు.

Rakul Preet Singh
Rakul Preet Singh : బాలీవుడ్ ప్రేమ జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీల వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. సిక్కు, మరి సింధీ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు తరలి వెళ్లారు.
Vikrant Massey : హిందువులను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు.. క్షమాపణలు చెప్పిన నటుడు
రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీల వివాహ వేడుక గోవాలో సన్నిహితుల మధ్య గ్రాండ్‌గా జరిగింది. సౌత్ గోవాలోని ITC గ్రాండ్ లో వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. వీరి వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అర్జున్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా, రితీష్ దేఖ్‌ముఖ్, వరుణ్ ధావన్, టైగర్ ష్రాఫ్, శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా, వరుణ్ ధావన్, నటాషా దలాల్, ఈషా డియోల్, భూమి పెడ్నేకర్, సోనమ్ కపూర్, షాహిద్ కపూర్‌లు హాజరయ్యారు. టాలీవుడ్ నటులు కూడా వీరి పెళ్లి వేడుకకు వెళ్లినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన సంగీత్ వేడుకలో స్టార్స్ అంతా ప్రత్యేక ప్రదర్శనలతో సందడి చేసారు. కాగా వీరి పెళ్లి వేడుకలు మొదట ఆనంద్ కరాజ్ (సిక్కు సంప్రదాయం), సింధీ సంప్రదాయ పద్ధతుల్లో జరిగినట్లు తెలుస్తోంది.ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Mahesh Babu : రాజమౌళితో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ పని చేయనన్న మహేశ్ బాబు?
పెళ్లికి ముందు రకుల్, జాకీలు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. 2021 అక్టోబర్ లో వీరు తమ బంధాన్ని సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుతం రకుల్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నారు. జాకీ భగ్నానీ నిర్మించిన ‘బడే మియా చోటే మియా’ సినిమా ఈద్‌కు రిలీజ్ అవుతోంది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram