Mahesh Babu : రాజమౌళితో సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ పని చేయనన్న మహేశ్ బాబు?
దర్శకదీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది.

Mahesh Babu-Rajamouli
Mahesh Babu-Rajamouli : దర్శకదీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇండియానా జోన్స్ లాంటి కథతో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ పూర్తి అయింది. అతి త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ పూరై, విడుదల కావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.
అయితే.. మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జక్కన్నతో సినిమా నేపథ్యంలో మహేశ్ కీలక నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఎటువంటి యాడ్స్‌లో నటించకూడని నిర్ణయించుకున్నట్లు ఆ వార్తల సారాంశం. మరీ ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంత కాలం ఆగక తప్పదు.
Nikhil : హీరో నిఖిల్‌కి కొడుకు పుట్టాడు
ఎస్ఎస్ఎంబీ 29 ఈ చిత్ర షూటింగ్ మే నెల నుంచి మొదలుకానున్నట్లు ఇప్పటికే చిత్ర నిర్మాత నుంచి క్లారిటీ వచ్చింది. కాగా.. ఈ చిత్రం కోసం విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గా నటిస్తుందని, హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ కీ రోల్‌లో కనిపిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.