Nikhil : హీరో నిఖిల్‌కి కొడుకు పుట్టాడు

హీరో నిఖిల్-పల్లవి దంపతులకు కొడుకు పుట్టాడు. నిఖిల్ తన కొడుకును ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Nikhil : హీరో నిఖిల్‌కి కొడుకు పుట్టాడు

Nikhil

Updated On : February 21, 2024 / 2:22 PM IST

Nikhil : హీరో నిఖిల్ -పల్లవి దంపతులకు కొడుకు పుట్టాడు. సోషల్ మీడియాలో నిఖిల్ తన బిడ్డని ముద్దాడుతున్న ఫోటో వైరల్ అవుతోంది. నెటిజన్లు నిఖిల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Nikhil 2

Nikhil 2

Ishita Raj Sharma : బుల్లి డ్రెస్ సోయగాలతో హీటేక్కిస్తున్న ఇషితా రాజ్ శర్మ..

హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి నేషనల్ వైడ్ పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన స్పై సినిమా కూడా ఫర్వాలేదు అనిపించింది. ఇప్పుడు ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. స్వయంభు, ది ఇండియా హౌస్, కార్తికేయ 3 ప్రాజెక్టులు నిఖిల్ చేతిలో ఉన్నాయి. స్వయంభు సినిమా ఆల్రెడీ షూటింగ్ జరుపుకుంటోంది. కాగా నిఖిల్ దంపతులకు మగ బిడ్డ పుట్టాడు. నిఖిల్ తన కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Vishwak Sen : ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్.. విశ్వక్ సేన్ అంటూ అల్లు అర్జున్ కజిన్ స్టేట్‌మెంట్..

నిఖిల్‌కు 2020 లో పల్లవి అనే అమ్మాయితో వివాహం అయ్యింది. ఇటీవలే పల్లవి సీమంతం ఫోటోలు కూడా నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. మా ఫస్ట్ బేబీ త్వరలో రానుంది అంటూ పోస్టు పెట్టారు. రీసెంట్‌గా వారికి మగ బిడ్డ పుట్టాడని తెలిసి సీనీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.