Vikrant Massey : హిందువులను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు.. క్షమాపణలు చెప్పిన నటుడు
12th ఫెయిల్ నటుడు విక్రాంత్ మస్సే సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ పోస్టు పెట్టారు. అసలు ఏం జరిగింది? ఎందుకు క్షమాపణలు చెప్పారు?

Vikrant Massey
Vikrant Massey : విధు వినోద్ చోప్రా డైరెక్షన్‌లో విక్రాంత్ మస్సే నటించిన ’12th ఫెయిల్’ సినిమా అందరి ప్రశంసలు పొందింది. ముఖ్యంగా విక్రాంత్ మస్సేకి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ నటుడు 2018 నాటి ఒక వివాదాస్పద ట్వీట్‌కు ఇప్పుడు క్షమాపణలు చెప్పడం వైరల్ అవుతోంది.
Prabhas : బోయపాటి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నారా..!
విక్రాంత్ మస్సే ’12th ఫెయిల్’ తో తిరుగులేని ప్రజాదరణ పొందారు. ఐపీఎస్ ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ పాత్రలో ఒదిగిపోయి నటించారు. ప్రముఖుల ప్రశంసలు పొందారు. కాగా విక్రాంత్ మస్సే 2018 లో తను చేసిన వివాదాస్పద ట్వీట్‌కు రీసెంట్‌గా సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. సీతారామ భక్తులపై వ్యాఖ్యానిస్తున్నట్లు చూపించే ఎడిటోరియల్ కార్టూన్‌ను జోడించి 2018 లో విక్రాంత్ మస్సే ఒక ట్వీట్ చేసారు. అది షేర్ చేసిన తర్వాత అనేకమంది విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రీసెంట్‌గా ఆ పోస్టును తొలగించిన విక్రాంత్ సోషల్ మీడియాలో క్షమాపణలు కోరుతూ పోస్ట్ పెట్టారు.
‘2018 నాటి నా ట్వీట్ గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. హిందూ సమాజాన్ని బాధపెట్టడం లేదా కించపరచడం లేదా అగౌరవ పరచడం నా ఉద్దేశం కాదు. కానీ హాస్యాస్పదంగా నేను చేసిన ట్వీట్ గురించి ఆలోచించినప్పుడు దాని అంతరార్ధాన్ని కూడా గ్రహించాను. వార్తాపత్రికలో ప్రచురించబడిన కార్టూన్‌ను జోడించకుండా కూడా ఇదే విషయాన్ని చెప్పవచ్చు.. నేను అన్ని మతాలు, విశ్వాసాల పట్ల గౌరవభావంతో ఉన్నాను. నా ట్వీట్ వల్ల ఎవరి మనసైనా గాయపడి ఉంటే ప్రతి ఒక్కరికీ క్షమాపణ చెబుతున్నాను. మనమంతా కాలంతో పాటు మారతాము.. మన తప్పులు మనం గ్రహిస్తాం.. ఇది నా తప్పు.. క్షమించండి’ అంటూ విక్రాంత్ మస్సే క్షమాపణలు చెప్పారు.
Vishwak Sen : ఈ జనరేషన్ జూనియర్ ఎన్టీఆర్.. విశ్వక్ సేన్ అంటూ అల్లు అర్జున్ కజిన్ స్టేట్‌మెంట్..
ముంబయికి చెందిన లాయర్ అశుతోష్ దూబే విక్రాంత్ మస్సేతో చేసిన చాట్ స్క్రీన్ షాట్ ఆన్ లైన్‌లో పంచుకున్న తర్వాత విక్రాంత్ సోషల్ మీడియాలో క్షమాపణలు కోరారు. ప్రస్తుతం విక్రాంత్ ట్వీట్ వైరల్ అవుతోంది.
In context to one of my Tweets way back in 2018, I’d like to say a few words:
It was never my intention to hurt, malign or disrespect the Hindu community.
But as I reflect in hindsight about a Tweet made in jest, I also release the distasteful nature of it. The same could…
— Vikrant Massey (@VikrantMassey) February 20, 2024
Conversation with Vikrant:
Clear and loud!??? pic.twitter.com/u6DRYjT1CG— ADV. ASHUTOSH J. DUBEY ?? (@AdvAshutoshBJP) February 20, 2024