Bezawada Prasanna Kumar : ఇండస్ట్రీలో అనసూయ ఎదుర్కొన్న కష్టాలు ఎవరికీ తెలీదు..ఆసక్తికర విషయాలు బయటపెట్టిన రైటర్
తెలుగు ఇండస్ట్రీలో అనసూయ అంత టఫ్ అమ్మాయి లేదన్నారు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఇండస్ట్రీలో తను నెగ్గుకురావడం వెనుక ఉన్న స్ట్రగుల్ చాలామందికి తెలియదంటూ ఆసక్తికర విషయాలు చెప్పారు.

Bezawada Prasanna Kumar
Bezawada Prasanna Kumar : యాంకర్‌గా కెరియర్ మొదలుపెట్టి నటిగా పాపులారిటీ తెచ్చుకున్నారు అనసూయ. ఫ్యామిలీ, కెరియర్ బాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అనసూయ గురించి సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
Rakul Preet Singh : ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్
నటి అనసూయ భరద్వాజ్ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండే అనసూయ కొన్ని సార్లు నెటిజన్ల నుండి ఎదురయ్యే ట్రోల్స్ వల్ల ఇబ్బందులు కూడా పడ్డారు. కాగా అనసూయ గురించి ఓ ఇంటర్వ్యూలో సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ మాట్లాడారు. ‘అలీ టాకీస్’ అనే షో చేసినప్పుడు అనసూయ పడ్డ కష్టాలు చెప్పుకొచ్చారు. ఎపిసోడ్ షూట్ కాగానే.. మరో ఎపిసోడ్‌కి రాత్రి 7 గంటలకు వచ్చి 1 గంట వరకు రిహార్సల్ చేసేదని.. ఆమె భర్త బయట కారులో వెయిట్ చేసేవారని ప్రసన్న కుమార్ చెప్పారు. ఒక కొత్త షో టెస్ట్ షూట్ కోసం అంతా ఫిక్స్ చేసుకున్నామని.. షూట్ కి రెండు రోజుల ముందు అనసూయకి డెలివరీ అయ్యిందని.. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన మర్నాడు రెస్ట్ తీసుకుని మూడో రోజు షూట్‌కి వచ్చారని ప్రసన్న కుమార్ చెప్పారు. ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూ ప్రతి అరగంటకి వెళ్లి బేబికి ఫీడింగ్ ఇస్తూ యాంకరింగ్ చేసారని.. అలా ఎవరూ చేయలేరని ప్రసన్న కుమార్ అన్నారు.
Vikrant Massey : హిందువులను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు.. క్షమాపణలు చెప్పిన నటుడు
అయితే ఆ ఒక్కరోజు షూటింగ్ కోసం ఇప్పటి వరకు అనసూయ డబ్బులు అడగలేదని ప్రసన్న కుమార్ చెప్పారు. కనీసం ఆల్టర్‌నేట్ చూసుకోమని కూడా చెప్పలేదని .. అసలు వాళ్లింట్లో వాళ్లు ఒప్పుకోవడం కూడా గ్రేట్ అని అన్నారు. సోషల్ మీడియాలో చాలామంది ఆమె గ్లామర్ చూసి విమర్శలు చేస్తారని ఆ కామెంట్స్ చూస్తే వాళ్లు చిన్నగా అనిపిస్తారని అన్నారు. అనసూయ అంత టఫ్ అమ్మాయిని తను ఇండస్ట్రీలో చూడలేదని.. ఏ అబ్బాయి తనని ఫ్లర్ట్ చేయలేడని.. చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని .. తన వెనకాల ఉన్న స్ట్రగుల్ తెలిసిన వారు బ్యాడ్ కామెంట్స్ చేయరని ప్రసన్న కుమార్ చెప్పారు. ఇండస్ట్రీలో అనసూయ నెగ్గుకురావడం వెనుక కష్టాలను చెబుతూ బెజవాడ ప్రసన్న కుమార్ ఎమోషనల్ అయ్యారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.