Viduthalai 1: అయోమయంలో పడేసిన విడుదల.. వస్తుందా లేదా..?

తమిళ వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన ‘విడుతలై-1’ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ చేస్తున్నారు.

Viduthalai 1: అయోమయంలో పడేసిన విడుదల.. వస్తుందా లేదా..?

Viduthalai 1 OTT Streaming From This Date

Updated On : April 25, 2023 / 11:41 AM IST

Viduthalai 1: తమిళ వర్సటైల్ డైరెక్టర్ వెట్రిమారన్ సినిమా వస్తుందంటే, కేవలం తమిళ ఆడియెన్స్ మాత్రమే కాకుండా ఇతర భాషలకు చెందిన ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. నేచురాలిటీకి దగ్గరగా ఉండే వెట్రిమారన్ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన సినిమాల్లో హీరో స్టార్‌డమ్‌తో ఎలాంటి పని లేకుండా, కేవలం కంటెంట్‌తోనే సినిమాలు తీస్తుంటాడు. అలాంటి సినిమాలతోనే ఆయన నేషనల్ అవార్డులు కూడా అందుకున్నాడు.

Viduthalai Movie: ఒకేసారి తమిళ్, తెలుగులో రిలీజ్ కాబోతున్న వెట్రిమారన్ ‘విడుతలై-1’ మూవీ!

ఇక వెట్రిమారన్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘విడుతలై-1’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాలో సూరి హీరోగా నటించగా, విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాను తెలుగులో ‘విడుదల’ అనే పేరుతో రిలీజ్ చేశారు. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రిలీజ్ కోసం మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో స్ట్రీమింగ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Vidudala Part1 Release Press meet : విడుదల పార్ట్ 1 రిలీజ్ ప్రెస్ మీట్ గ్యాలరీ..

అదే రోజున తెలుగు వర్షన్‌ను కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అయితే, దీనీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమాలో భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.