Vijay Antony : మలేషియా చేరుకున్న విజయ్ ఆంటోనీ కుటుంబ సభ్యులు.. పరిస్థితి విషమం?
బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఈ హీరో బిచ్చగాడు-2 తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇటీవల ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం మలేషియా వెళ్ళింది చిత్ర యూనిట్. మలేషియా లోని సముద్రంలో బోట్ ఛేజింగ్ సీన్ తెరకెక్కిస్తుండగా విజయ్ ఆంటోనీకి యాక్సిడెంట్ జరిగింది.

Vijay Antony
Vijay Antony : బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు విజయ్ ఆంటోనీ. సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ నటుడిగా మారి నకిలీ, డాక్టర్ సలీమ్ వంటి సినిమాలతో హీరోగా వరుస హిట్టులు అందుకున్నాడు. ఇక ఆ తరువాత బిచ్చగాడు సినిమాతో హీరోగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకే సీక్వెల్ తీసుకు వచ్చే పనిలో ఉన్నాడు విజయ్. తానే దర్శకుడిగా మారి స్వీయ దర్శకత్వంలో బిచ్చగాడు-2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
Vijay Antony : బిచ్చగాడు-2 సెట్‌లో విజయ్ ఆంటోనికి ప్రమాదం..
ఇటీవల ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసం మలేషియా వెళ్ళింది చిత్ర యూనిట్. మలేషియా లోని సముద్రంలో బోట్ ఛేజింగ్ సీన్ తెరకెక్కిస్తుండగా విజయ్ ఆంటోనీకి యాక్సిడెంట్ జరిగింది. సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో విజయ్ డ్రైవ్ చేస్తున్న బోట్ అదుపు తప్పి కెమెరా ఉన్న పడవను ఢీ కొట్టింది. విజయ్ కి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతూ చాలా నీళ్లు తాగేశాడు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది కాపాడి ఆస్పత్రికి తరలించారు. అయితే విజయ్ ముఖానికి తీవ్ర గాయాలు అయ్యి, పళ్లు విరిగిపోయి అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు షూటింగ్ లో సిబ్బంది ఒకరు తెలియజేశాడు.
ఇక ఈ విషయం తెలిసిన విజయ్ ఆంటోనీ కుటుంబ సభ్యులు మలేషియా చేరుకున్నారు. విజయ్ ఇంకా అపస్మారక స్థితిలోనే ఉండడంతో అతని చెన్నై తీసుకు వస్తున్నట్లు విజయ్ భార్య ఫాతిమా ప్రకటించింది. దీంతో తమిళ మీడియా విజయ్ ఆంటోనీ పరిస్థితి విషమం అంటూ వార్తలు రాసుకొచ్చాయి. ఈ వార్తలు చూసిన విజయ్ అభిమానులు ఏమవుతుందో తెలియక కంగారు పడుతున్నారు. దీంతో విజయ్ సన్నిహితులు విజయ్ ఆంటోనీ పరిస్థితిని తెలియజేశారు. విజయ్ చికిత్స తీసుకుంటున్నాడు, త్వరలోనే కోలుకుంటాడు. మీడియాలో వచ్చే వార్తలు అన్ని అవాస్తం అంటూ తెలియజేశారు.