Vijay Devarakonda : మొత్తానికి బయటకొచ్చిన రౌడీ స్టార్.. ఆగిపోయిన ఖుషి పనులు మొదలు..
తాజాగా ఖుషి సినిమా మ్యూజిక్ వర్క్స్ ని మొదలుపెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహబ్ తో డైరెక్టర్ శివానిర్వాణ, విజయ్ దేవకొండ మ్యూజిక్ సిటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ వాహబ్ విజయ్, శివ నిర్వాణ తో కలిసి ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో...............

Vijay Devarakonda and shiva nirvana started music works of kushi movie with music director
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ లైగర్ సినిమా రిజల్ట్ తర్వాత సైలెంట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ తర్వాత పండగలకు సోషల్ మీడియాలో పోస్టులు తప్ప ఎక్కువగా మీడియా ముందుకు రాలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించినా ఇంకా షూట్ మొదలవ్వలేదు. ఇక సమంతకి ఆరోగ్యం బాగోకపోవడంతో ఇన్నాళ్లు విజయ్, సమంత జంటగా చేస్తున్న ఖుషి సినిమా షూట్ కూడా ఆగిపోయింది. దీంతో విజయ్ దేవరకొండ గత కొన్నిరోజులుగా ఖాళీగానే ఉంటున్నాడు. ఈ గ్యాప్ లో కొన్ని యాడ్స్ చేశాడు.
ఇటీవలే సమంత కొద్దిగా కోలుకొని బ్యాక్ టు వర్క్ కి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ ఘాటింగ్ లో పాల్గొంటుంది. ఈ సిరీస్ షెడ్యూల్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఖుషీలో పాల్గొనబోతుందని సమాచారం. ఇటీవలే డైరెక్టర్ శివ నిర్వాణ, సమంత.. త్వరలోనే ఖుషిని మళ్ళీ మొదలుపెట్టబోతున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.
TP Gajendran : సినీ పరిశ్రమలో మరో విషాదం.. ఒకప్పటి తమిళ్ స్టార్ డైరెక్టర్ కన్నుమూత..
తాజాగా ఖుషి సినిమా మ్యూజిక్ వర్క్స్ ని మొదలుపెట్టారు. మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వాహబ్ తో డైరెక్టర్ శివానిర్వాణ, విజయ్ దేవకొండ మ్యూజిక్ సిటింగ్స్ వేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ వాహబ్ విజయ్, శివ నిర్వాణ తో కలిసి ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ ఫోటో వైరల్ గా మారింది. మొత్తానికి మళ్ళీ విజయ్ దేవరకొండ సినిమా పనుల్లో బిజీ అయ్యాడని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. త్వరలోనే ఖుషి సినిమా షూట్ మొదలుపెట్టనున్నారని ప్రకటించడంతో షూట్ త్వరగా చేసి, సినిమా త్వరగా రిలీజ్ చేయాలని అటు సమంత అభిమానులు, ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నారు.
#Kushi is back in flow again.? #VijayDeverakonda meets director @ShivaNirvana and music director @HeshamAWMusic for music sittings.
Next schedule will start very soon. @Samanthaprabhu2 @MythriOfficial pic.twitter.com/at2pNh1BlV— BA Raju's Team (@baraju_SuperHit) February 4, 2023