Vijay Devarakonda : ‘దేవరశాంటా’ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. తన అభిమానులను తన సొంత ఖర్చుపై ఫ్రీ వెకేషన్ కి పంపిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా విజయ్ ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో 'మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా'కి ఓటు వేశారు. దీంతో ఈ ఏడాది దేవరశాంటా బహుమతి నేపథ్యంలో 100 మంది ఫ్యాన్స్ ని 'కులుమనాలి' పంపించడానికి నిర్ణయం తీసుకున్నాడు.

Vijay Devarakonda : ‘దేవరశాంటా’ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda gave an update on 'Devarasanta'

Updated On : January 8, 2023 / 11:01 AM IST

Vijay Devarakonda : టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. తన అభిమానులను తన సొంత ఖర్చుపై ఫ్రీ వెకేషన్ కి పంపిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హీరో గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ పేరుతో ప్రతి ఏటా ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ వస్తున్నాడు. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం 100 మంది అభిమానులను ఒక ఫ్రీ వెకేషన్ హాలిడేకి పంపిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు ఆ వెకేషన్ కి ఎక్కడకి వెళ్ళాలి అనుకుంటున్నారో అనేది కూడా అభిమానుల ఛాయస్ కే వదిలేశాడు విజయ్ దేవరకొండ.

Vijay Devarakonda : వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ పోస్ట్.. రష్మికతో ప్రేమాయణం?

అందుకోసం ఫ్యాన్స్ కి నాలుగు ఆప్షన్స్ ఇచ్చాడు. మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా.. ఇలా నాలుగు ఆప్షన్స్ లో ఎక్కడికి టూర్ వెళ్లాలన్నా విజయ్ దేవరకొండ పూర్తీ ఉచితంగా పంపించబోతున్నట్లు ప్రకటించాడు. కాగా ఈ ఆప్షన్స్ లో ఎక్కువ మంది అభిమానులు ‘మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా’కి ఓటు వేశారు. దీంతో ఈ ఏడాది దేవరశాంటా బహుమతి నేపథ్యంలో 100 మంది ఫ్యాన్స్ ని ‘కులుమనాలి’ పంపించడానికి నిర్ణయం తీసుకున్నాడు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.. “ఎక్కువమంది మౌంటెయిన్స్ కి వెళ్దాం అంటూ ఓటు వేశారు. కాబట్టి మీలో 100 మందిని అన్ని ఖర్చులతో నేను మనాలి పంపించబోతున్నా. ఇక మీలో 100 మందిని నేను ఎంపిక చేయాలి కాబట్టి.. 18 ఏళ్ళు దాటిన వారు దేవరశాంటా వెబ్ సైట్ కి వెళ్లి గూగుల్ డాక్యుమెంట్ ఫార్మ్ ని ఫిల్ చేయండి. ఆ ఫార్మ్స్ చూసి మీలో 100 మందిని ప్రకటిస్తాము” అంటూ వెల్లడించాడు. రౌడీ ఫ్యాన్స్ మరి త్వరగా ఆ ఫార్మ్ ఫిల్ చేసి, ఆ లక్కీ పర్సన్ మేరే అవ్వండి.