Vijay Devarakonda: పవన్ కళ్యాణ్ “టైటిల్స్”పైనే కాదు “డైరెక్టర్స్”పై కూడా కన్నేసిన విజయ్ దేవరకొండ.. నిజమేనా?
విజయ్ దేవరకొండ..సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి "రౌడీ" అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన "జనగణమన" ను విజయ్ తో స్టార్ట్ చేసినప్పటికీ, వీరిద్దరి కలయికలో విడుదలైన లైగర్ ఆశించిన విజయం సాదించకపోవడంతో "JGM" అటకెక్కింది. తాజాగా ఇంకో బ్లాక్ బస్టర్ దర్శకుడితో జతకడుతున్నట్టు తెలుస్తుంది.

Vijay Devarakonda in Harish Shankar Direction
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ..సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి “రౌడీ” అనే ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరో. యూత్ లో ఇతనికి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంత కాదు. డిఫరెంట్ అవుట్ ఫిట్‌తో, యార్‌గంట్ ఆటిట్యూడ్‌తో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే పాన్ ఇండియా చిత్రం లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ. తాజాగా ఇంకో బ్లాక్ బస్టర్ దర్శకుడితో జతకడుతున్నట్టు తెలుస్తుంది.
లైగర్ రిలీజ్ కి ముందే హీరో విజయ్.. పూరీతో మరో చిత్రం స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన “జనగణమన” ను విజయ్ తో స్టార్ట్ చేసినప్పటికీ, వీరిద్దరి కలయికలో విడుదలైన లైగర్ ఆశించిన విజయం సాదించకపోవడంతో “JGM” అటకెక్కింది. కాగా ఇప్పటికే స్టార్ట్ చేసిన ఖుషి సినిమాని పూర్తీ చేసే పనిలో పడ్డాడు విజయ్.
తన తదుపరి సినిమాకోసం మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో రౌడీ జతకడుతున్నట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. భవదీయుడు భగత్ సింగ్ కమిట్ అయిన హరీష్, పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ గ్యాప్ ని విజయ్ తో సినిమా చేసి ఫిల్ చేసుకుందామని చూస్తున్నాడని గాసిప్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ తో చెయ్యబోయే సినిమా దిల్ రాజు ప్రొడక్షన్ లోనే తెరకెక్కుతున్నట్టు, విజయ్ కి ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంత ఉందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.