Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక కాంబోలో మరో సినిమా.. మళ్ళీ ఎప్పుడు? ఛాన్స్ ఉందా?

తాజాగా విజయ్ దేవరకొండ మీడియాతో సమావేశం నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో రష్మికతో మళ్ళీ సినిమా ఎప్పుడు అని  అడిగారు.

Vijay Devarakonda says he will pair up with Rashmika again for movie waiting for good script

Vijay Devarakonda – Rashmika : విజయ్ దేవరకొండ లైగర్(Liger) సినిమా ఫ్లాప్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఖుషి(Kushi) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. విజయ్, సమంత(Samantha) జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.

తాజాగా విజయ్ దేవరకొండ మీడియాతో సమావేశం నిర్వహించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ నేపథ్యంలో రష్మికతో మళ్ళీ సినిమా ఎప్పుడు అని  అడిగారు. విజయ్ దేవరకొండ – రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. ఒక సినిమా పెద్ద హిట్ అవ్వగా ఒక సినిమా యావరేజ్ గా నిలిచింది. ఇక ఈ రెండు సినిమాలతో వీరిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. విజయ్ – రష్మిక మధ్య ఏదో నడుస్తుందని, ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని అంతా అనుకుంటున్నా మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని అంటున్నారు.

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో పూజా హెగ్డే ప్లేస్‌లో ఆ హీరోయిన్ ఫిక్స్.. మొన్నటిదాకా అబ్బాయి ఇప్పుడు బాబాయ్‌ సరసన..

తాజగా రష్మికతో మరో సినిమా గురించి విజయ్ మాట్లాడుతూ.. తప్పకుండా రష్మికతో ఇంకో సినిమా చేస్తాను. కథలు వింటున్నాను. నేను ఓకే చేసిన కథల్లో రష్మిక సెట్ అవుతుంది అనుకుంటే కచ్చితంగా ఆమెతో సినిమా చేస్తాను. మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను. రష్మికతో ఇంకో సినిమా ఉంటుంది అని తెలిపాడు. మరి రెండుసార్లు ప్రేమ సినిమాలతో వచ్చిన విజయ్ – రష్మిక ఈ సారి ఎలాంటి సినిమాతో వస్తారో చూడాలి.