Vijay Devarakonda : డబ్బులు ఇచ్చి మరీ నా మీద, నా సినిమా మీద నెగిటివ్‌గా రాపిస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు..

ఖుషి చిత్రయూనిట్ వైజాగ్(Vizag) లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Vijay Devarakonda : డబ్బులు ఇచ్చి మరీ నా మీద, నా సినిమా మీద నెగిటివ్‌గా రాపిస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు..

Vijay Devarakonda sensational comments he said someone gave money for negative promotions on his films

Updated On : September 5, 2023 / 8:27 AM IST

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha) జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో వచ్చిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఖుషి(Kushi) సినిమా సెప్టెంబర్ 1న గ్రాండ్ గా రిలీజయి మంచి విజయం అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా మూడు రోజుల్లోనే 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 100 కోట్ల కలెక్షన్స్ కి దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ వైజాగ్(Vizag) లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఖుషి మీద మీరు చూపిస్తున్న ప్రేమ నాకు తెలుస్తోంది. నేను ఇంట్లో ఉన్నా ఆ ప్రేమను ఫీలవుతున్నా. నా మీద, నా సినిమా మీద అటాక్స్ జరుగుతున్నాయి. మా ఖుషి మీద ఫేక్ బుక్ మై షో రేటింగ్స్, ఫేక్ యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. వేలాది ఫేక్ అక్కౌంట్స్ క్రియేట్ చేసి, యూట్యూబ్ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందుకు కొంతమంది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నా మీద, నా సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ దాటుకుని అభిమానులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ నెంబర్స్, సక్సెస్ అందుకుంటున్నాం. ఈ విజయానికి మీరే కారణం. మూడు రోజుల్నించి చూస్తున్నా మీ మొహల్లో సంతోషం చూసి నాకు చాలా తృప్తిగా ఉంది అని అన్నాడు.

Vijay Devarakonda : 100 ఫ్యామిలిలు సెలెక్ట్ చేస్తా.. ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయలు ఇస్తా.. విజయ్ దేవరకొండ కామెంట్స్..

దీంతో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విజయ్ మీద సోషల్ మీడియాలో నెగిటివిటి మామూలుగానే ఉంటుంది. లైగర్ సినిమా వరకు విజయ్ యాటిట్యూడ్ వల్లే విజయ్ దేవరకొండకు ఈ నెగిటివిటి వస్తుందని అందరికి తెలిసిందే. కానీ విజయ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో అతని మీద డబ్బులు ఖర్చుపెట్టి మరీ నెగిటివ్ ప్రచారం ఎవరు చేయిస్తున్నారు అని ఇప్పుడు ప్రశ్నగా మారింది.