Vijay Deverakonda : తమిళ్ దర్శకుడితో సినిమా కన్ఫార్మ్ చేసిన విజయ్ దేవరకొండ..
ఖుషి ప్రమోషన్స్ లో ఉన్న విజయ్.. చెన్నైలో తమిళ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే తమిళ దర్శకుడితో సినిమా..

Vijay Deverakonda about his future collaboration with tamil director
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా ప్లాప్ తరువాత స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. ఇదే క్రమంలో తన మార్కెట్ పరిధిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఖుషి (Kushi) చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నాడు. ఆ తరువాత రాబోయే VD12 అండ్ VD13 ని కూడా ఇతర భాషల్లోకి తీసుకు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాడు. అంతేకాదు ఇతర బాషల దర్శకులతో సినిమాలు చేసి, ఆ పరిశ్రమలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు.
Salaar : ప్రభాస్ ‘సలార్’ రైట్స్ కొనడంలో.. డిస్టిబ్యూటర్లు వెనకడుగు వేస్తున్నారట.. నిజమేనా..?
ఈక్రమంలోనే పలువురు దర్శకుల వద్ద కథలు వినడం కూడా జరిగిందట. వారిలో ఒక తమిళ్ డైరెక్టర్ ని ఫైనల్ చేసినట్లు విజయ్ కన్ఫార్మ్ చేశాడు. ఖుషి ప్రమోషన్స్ లో ఉన్న విజయ్.. చెన్నైలో తమిళ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే తమిళ్ డైరెక్ట్ ఫిలిం ఉంటుందా? అని ప్రశ్నించగా, విజయ్ బదులిస్తూ.. “తమిళ దర్శకుడితో సినిమా అయితే ఓకే. కానీ అది తెలుగులోనే డైరెక్ట్ చేస్తారా? లేదా తెలుగు-తమిళంలో బై లింగువల్ గా తెరకెక్కిస్తారా? అనేది ఇంకా క్లారిటీ లేదు” అంటూ పేర్కొన్నాడు.
Vijay Deverakonda : రజిని జైలర్ హిట్ అయ్యి.. భోళాశంకర్ ప్లాప్ అయితే.. చిరంజీవి స్థాయి తగ్గిపోదు..
ఈ కామెంట్స్ విన్న అభిమానులు.. విజయ్ ఏ తమిళ్ దర్శకుడితో జతకట్టబోతున్నాడు అని తెగ ఆలోచించేస్తున్నారు. ఇక ఖుషి విషయానికి వస్తే.. సమంత (Samantha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 1న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ మూవీ పై మంచి అంచనాలనే క్రియేట్ చేశాయి. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.