అప్పుడే పెళ్లేంటి.. నేనింకా పిల్లాడినే..
వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలవుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ గురించి విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు..

వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలవుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ గురించి విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు..
‘పెళ్ళి చూపులు’ లాంటి డీసెంట్ హిట్ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ సినిమాలో ఆయన నటనతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తర్వాత ‘అర్జున్ రెడ్డి’లో తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీస్ రికార్డ్ సృష్టించి స్టార్ హీరోగా మారి యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పరచుకున్నాడు. అనంతరం ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి సూపర్‌హిట్ చిత్రాలతో సెన్సేషనల్ హీరోగా మారాడు.
ప్రస్తుతం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై యంగ్ ప్రొడ్యూసర్ కె.ఎ.వల్లభ నిర్మించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్లుగా నటించారు. వేలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలవుతున్న సందర్భంగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
కొత్తగా కనిపిస్తున్నారు?
మాములుగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో కొన్ని ఫేజ్‌లు ఉంటాయి. ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చేసిన తర్వాత నేను కూడా మారుతున్నా. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, నా చుట్టూ ఉన్న పరిసరాలు కానీ క్లీన్‌గా ఉండాలి అనుకుంటున్నా. నాలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎందుకువచ్చిందో నాకే తెలీదు.
ఈ ఫేజ్ లో మీరు కొత్తగా ఏం చేయాలి అనుకుంటున్నారు?
ఇంకో మూడు నెలల్లో మీరే చూస్తారు. అలాగే మరో రెండు సంవత్సరాల వరకు నేను చేసే సినిమాలు కొత్తగా ఉండబోతున్నాయి.
మీ ప్రతి సినిమాని ‘అర్జున్ రెడ్డి’ తో పోలుస్తున్నప్పుడు మీకెలా అనిపిస్తుంది?
నేను ఇప్పుడు ఒక యాక్షన్ సినిమాలో గెడ్డం పెంచితే ‘అర్జున్ రెడ్డి’ అంటారు. అలాగే లవ్ స్టోరీ, సైన్స్ ఫిక్షన్ స్టోరీలో గెడ్డం పెంచినా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతోనే పోలుస్తారు. అది నాకు తప్పదు. అలా పోల్చడం వల్ల నాకేమి బాధ అనిపించదు కూడా. ఎందుకంటే ‘అర్జున్ రెడ్డి’ అనేది ఒక సూపర్ హిట్ మూవీ. కొన్ని తరాలపాటు గుర్తుంచుకోదగ్గ సినిమా. అలాంటి క్రేజీ గుడ్ ఫిలింతో పోలుస్తున్నందుకు హ్యాపీ.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో మూడు రకాల లవ్ స్టోరీస్‌ని ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే ఒక లవ్ ట్రాక్ మాత్రం ‘అర్జున్ రెడ్డి’ కి సిమిలర్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా సినిమా ఒక డిఫరెంట్ స్పేస్‌లో ఉంటుంది. ఇప్పటి వరకు నేను ఇటువంటి స్పేస్‌లో ఉన్న సినిమా చూడలేదు.
ఈ సినిమాతో సిక్సర్ కొడుతున్నారా?
బాల్ అయితే గాలిలో ఉంది. మరి చూడాలి బౌండరీ అవతలపడుతుందో లేదో..(నవ్వుతూ).
ఈ సినిమాలో నాలుగు విభిన్నమైన లవ్ స్టోరీస్ చేయడం వల్ల ప్రేమకథలు అంటే మీకు ఆసక్తి తగ్గిందా?
అలా అంటే అమ్మాయిలు బాధపడతారు. కానీ అన్ని రకాల కథలు చేయాలి, ఎప్పుడూ ఒకేరకమైన కథలు చేయడం నాకు మంచిది కాదు, ప్రేక్షకులకు కూడా ఇష్టం ఉండదు.
ప్రేమపై మీ అభిప్రాయం?
ఒకప్పుడు ప్రేమ అనేది నాన్ సెన్స్ అనుకున్నా… కానీ ఇప్పుడు ప్రేమపై నాకు నమ్మకం కుదిరింది, లైఫ్‌లో ప్రేమ అనేది ఉండాలి.
మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?
పెళ్లి చేసుకుంటా కానీ ఇప్పుడే కాదు, నా ఒపీనియన్‌లో నేను ఇంకా పెళ్ళికి సిద్ధం కాలేదు, ఇంకా పిల్లాడినే అనుకుంటున్నా. పెళ్లి అనేది చాలా పెద్ద భాద్యత అందుకే ఇంకొంత సమయం తరువాత ఆలోచిస్తా.
దర్శకుడు క్రాంతి మాధవ్ గురించి?
ఈ సినిమాకు సంబంధించి యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా ఆడియన్స్‌కి నచ్చితే ఆ క్రెడిట్ మా డైరెక్టర్ క్రాంతి మాధవ్‌కి, సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ, నిర్మాత రామారావు, వల్లభ గారికే దక్కుతుంది. ఇది కంప్లీట్‌గా క్రాంతి ఐడియా నుండి వచ్చిన స్క్రిప్ట్. సో తన రైటింగ్‌తో ఆడియన్స్‌ని మెప్పిస్తాడని నమ్ముతున్నా.
ఈ సినిమాలో మూడు ప్రేమ కథలు అంటున్నారు.. వాటి మధ్య రిలేషన్ ఉంటుందా?
మూడు కథలకు మధ్య రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ ఏమిటనేది మీరు తెరపై చూసి తెలుసుకోవాలి.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రం కోసం బాగా కష్టపడ్డారా?
నా కెరీర్‌లో హార్డెస్ట్ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా ఒత్తిడికి గురయ్యాను. వివిధ గెటప్స్, పాత్రలలో వేరియేషన్స్ కొరకు చాలా కష్టపడాల్సివచ్చింది.
‘డియర్ కామ్రేడ్’ ఫలితం పై మీ అభిప్రాయం?
ఆ సినిమాకు రివ్యూస్ ఎలా వచ్చినా నార్త్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలలో మంచి ఆదరణ దక్కించుకుంది. అలాగే ‘ఫైటర్’ షూటింగ్ చేస్తుంటే ముంబైలో అందరూ ‘బాబీ’ అని పిలుస్తున్నారు. ఆ చిత్ర ఫలితంపై నేను సంతృప్తి కరంగా ఉన్నాను.
ఈ సినిమాలో మీ ఫేవరేట్ క్యారెక్టర్ ఏది?
‘సీనయ్య’ నా ఫేవరేట్. ఆ క్యారెక్టర్ కోసం మా నాన్న అప్పట్లో ఎలా ఉండే వాడో గుర్తుచేసుకుంటూ నటించా. ఇప్పుడంటే మా నాన్న షార్ట్స్ వేసుకుంటున్నారు కానీ అప్పట్లో ఆయన లుంగీ కట్టుకొని కొన్ని మేనరిజమ్స్‌తో మాట్లాడే వారు. ఈ సినిమా వరకూ ఆయన్నే ఫాలో అయ్యాను. సినిమాలో ఐశ్వర్య రాజేష్ చేసిన సువర్ణ రోల్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది.
మిమ్మల్ని ట్రోల్ చేసేవారిని ఎలా చూస్తారు?
సోషల్ మీడియాలో నా మీద కొన్ని మీమ్స్ చేసి ట్రోల్ చేస్తుంటారు. అవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తా. వాళ్ళు నా గురించి టైం తీసుకొని వీడియో లేదా ఫోటో ఎడిట్ చేస్తున్నారంటే నా మీద ప్రేమతోనే అని భావిస్తాను. సో నేను ఎప్పుడూ వాళ్ళ మైండ్‌లో ఉంటున్ననందుకు ఫీలింగ్ హ్యాపీ.
రెండు రోజుల ముందే బుకింగ్స్ ఫుల్ అవడం ఎలా అనిపిస్తుంది?
సినిమాకైనా మేము కష్టపడేది ఆడియన్స్ టికెట్స్ కొని థియేటర్స్‌కి రావాలని.. ఇక నా ప్రతీ సినిమాకి రెండు రోజుల ముందే టికెట్స్ బుక్ అవ్వడం, ఆ తర్వాత హౌజ్ ఫుల్స్ అవ్వడం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే పూరి గారి సినిమా కోసం చాలా కష్టపడుతున్నా. ఒక ఎక్సైట్‌మెంట్‌తో చేస్తున్న సినిమా అది.