James Bond : ‘జేమ్స్ బాండ్’గా విజయ్ దేవరకొండ సెట్ అవుతాడు అంటున్న చాట్ జీపీటీ.. నెక్స్ట్ జేమ్స్ బాండ్ 007 ఎవరు?
డేనియల్ క్రెగ్ బాండ్ పాత్రకు రిటైర్మెంట్ ప్రకటించడంతో నెక్స్ట్ బాండ్ ఎవరు అనే ప్రశ్న ఎదురవుతుంది.

Vijay Deverakonda also Can Replace James Bond Character Chat GPT Suggest So Many Actors Details Here
James Bond : వరల్డ్ సినిమాలో జేమ్స్ బాండ్ పాత్రకు, ఆ సినిమాలకు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్నిచోట్లా జేమ్స్ బాండ్ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పాత్రను ఆధారంగా తీసుకొని మన దగ్గర కూడా అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పటికే జేమ్స్ బాండ్ 007 సిరీస్ లో 20 సినిమాలు రాగా అన్ని మంచి విజయాలు సాధించాయి. ఇక జేమ్స్ బాండ్ పాత్రల్లో ఇప్పటి వరకు సీన్ కానరీ, జార్జ్ లేజంబి, రోజర్ మూర్, తిమోతి డల్టన్, పియర్స్ బ్రోస్నన్, డేనియల్ క్రెగ్.. నటించారు.
చివరి బాండ్ సినిమా 2021లో వచ్చింది. ఆ సినిమాలో డేనియల్ క్రెగ్ బాండ్ పాత్రలో నటించాడు. ఈ సినిమా తర్వాత డేనియల్ క్రెగ్ బాండ్ పాత్రకు రిటైర్మెంట్ ప్రకటించడంతో నెక్స్ట్ బాండ్ ఎవరు అనే ప్రశ్న ఎదురవుతుంది. అయితే బాండ్ చిత్రాల నిర్మాత బ్రొకోలీస్ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ దీనిపై ఆసక్తికర సమాధానం చెప్పారు.
Also Read : Allu Arjun : డ్రగ్స్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్.. వీడియో చూశారా?
బ్రొకోలీస్ మాట్లాడుతూ.. నెక్స్ట్ బాండ్ పాత్రకు హీరోని వెతుకుతున్నాము. ఈ క్రమంలో చాట్ జీపీటీని బాండ్ పాత్రకు ఎవడు సరిపోతారు అని కూడా అడిగాము అని తెలిపాడు. హాలీవుడ్ లో అయితే బాండ్ పాత్రకు హెన్రి కావిల్, టామ్ హార్డీ, రిచర్డ్ మైదాన్, ఇద్రీస్ ఎల్బా, ఆరన్ టేలర్, జేమ్స్ నార్తన్, సిలన్ మార్ఫి, ల్యూక్ ఎవాన్స్.. ఇలా పలువురు హాలీవుడ్, బ్రిటిష్ యాక్టర్స్ ని సజెస్ట్ చేసిందట చాట్ జీపీటీ.
ఈ క్రమంలో ఇండియన్ యాక్టర్స్ జేమ్స్ బాండ్ పాత్ర పోషించగలరా అని చాట్ జీపీటీని అడిగితే.. ఇండియన్ యాక్టర్ ని బాండ్ పాత్రకు తీసుకోవాలి అనుకోవడం పెద్ద రిస్క్. దానికి మళ్ళీ సరికొత్త కథ రాసుకోవాలి. ఇండియన్ కల్చర్ కు తగ్గట్టు బ్యాక్ స్టోరీలు రాసుకోవాలి, కథనంలో మార్పులు చేసుకోవాలి. అయితే బాండ్ ఉన్న గుణగణాలను ఆధారంగా తీసుకుంటే ఆ పాత్రకు సరిపోతారు అనుకుంటే ఏ దేశం, ఏ రంగు యాక్టర్ అయినా తీసుకోవచ్చు అని చూపించిందట. ఇండియన్ యాక్టర్స్ లో జేమ్స్ బాండ్ పాత్రకు ఎవరు సరిపోతారు అని చాట్ జీపీటీని అడగగా మొదట హృతిక్ రోషన్ పేరు చూపించింది. ఆ తర్వాత షాహిద్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా, ఫర్హాన్ అక్తర్, రణవీర్ సింగ్, విజయ్ దేవరకొండ, ఆదిత్య రాయ్ కపూర్ లను చూపించిందంట.
దీంతో ఈ వార్త వైరల్ గా మారింది. తెలుగు నుంచి బాండ్ పాత్రకు కేవలం విజయ్ దేవరకొండ ఒక్కర్నే చాట్ జీపీటీ సజెస్ట్ చేయడం ఆశ్చర్యంగా ఉన్నా విజయ్ ఫ్యాన్స్ మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి భవిష్యత్తులో విజయ్ దేవరకొండ బాండ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు నటిస్తాడేమో చూడాలి. మరి నెక్స్ట్ జేమ్స్ బాండ్ సినిమాలో బాండ్ పాత్రలో ఎవరు నటిస్తారో, ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి.