Vijay Deverakonda : బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా..

రీసెంట్‌గా నాకు ఒక హార్ట్ బ్రేక్ జరిగింది.. ఇప్పటి వరకు ఎవ్వరికీ ఆ విషయం తెలియదు - విజయ్ దేవరకొండ..

Vijay Deverakonda

Vijay Deverakonda: ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ తర్వాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మూడో సినిమా ‘పుష్పక విమానం’.. దామోదర దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

TABU : ఆ హీరో వల్లే టబు పెళ్లి చేసుకోలేదంట!

సినిమా ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 12న రిలీజ్ కానున్న ‘పుష్పక విమానం’ మూవీ మీద మంచి హైప్ ఏర్పడింది. తమ్ముడి సినిమాకి తనవంతు సాయం చెయ్యడానికి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు విజయ్.

రీసెంట్‌గా విజయ్ – ఆనంద్ చేసిన చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. తమ్ముడి సినిమా గురించి వివరాలు చెప్పిన విజయ్.. రీసెంట్‌గా తనకు ఒక హార్ట్ బ్రేక్ జరిగిందని.. ఇప్పటి వరకు ఎవ్వరికీ ఆ విషయం తెలియదని.. అందుకే కొంచెం బాధలో ఉన్నానని చెప్పాడు. దీంతో నెటిజన్లు విజయ్‌కి ఎవరో ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చినట్లుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.