Vijay Deverakonda-Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నకి నిశ్చితార్థం? ఫిబ్రవరిలో…!

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న పెళ్లి చేసుకుంటున్నారని.. ఫిబ్రవరిలో నిశ్చితార్థం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నేషనల్ మీడియా ఈ వార్తలు రాయడం ఆసక్తి రేపుతోంది.

Vijay Deverakonda-Rashmika Mandanna

Vijay Deverakonda-Rashmika Mandanna : విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న ఫైనల్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? ఫిబ్రవరిలో వీరి నిశ్చితార్ధం ఉంటుందా? నేషనల్ మీడియాలో వచ్చిన ఈ వార్తల్లో నిజమెంత?

Salaar : ప్రభాస్ ‘సలార్’ సక్సెస్ పార్టీ సెలబ్రేషన్ ఫోటోలు..

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు ఎక్కడ కలిసినా ఈ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇద్దరూ కలిసి వెకేషన్స్‌కి వెళ్లడం, విజయ్ ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యంలో, పండుగలో రష్మిక పాల్గొనడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ వచ్చింది. ఈ జంట మాత్రం ఏ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని.. ఫిబ్రవరి రెండో వారంలో నిశ్చితార్థం ఉంటుందని నేషనల్ మీడియా కోడై కూస్తోంది.

రష్మికకి గతంలో ‘కిర్రిక్ పార్టీ’ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం జరిగింది. ఆ తర్వాత రష్మిక విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత రక్షిత్ శెట్టితో జరిగిన నిశ్చితార్ధానికి రష్మిక బ్రేకప్ చెప్పారు. విజయ్ దేవరకొండతో ప్రేమలో పడటమే అందుకు కారణమని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.  ఇక ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ స్టార్ డమ్ అమాంతంగా పెరిగిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లకు సైతం ఆయన ఫేవరెట్ హీరోగా మారిపోయారు. ఇటు రష్మిక సైతం ‘యానిమల్’ వంటి సినిమాలతో బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు. అక్కడ వరుస ఛాన్స్‌లు వస్తున్నాయి. ఇక వీరిద్దరి లవ్ స్టోరీ గురించి బాలీవుడ్‌లో కూడా చర్చ మొదలైంది.

Kapil Dev : ఇంట‌ర్నెట్‌ను ఊపేస్తున్న క‌పిల్‌దేవ్ డ్యాన్స్‌.. ఎవ‌రితో, ఏ పాట‌కో తెలుసా?

తాజాగా వీరి నిశ్చితార్ధం గురించి నేషనల్ మీడియా వార్తలు రాసింది. ఫిబ్రవరిలో ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చితార్ధం చేయడానికి నిర్ణయించారని ఆ వార్తల సారాంశం. అయితే అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా ‘VD 12’ ప్రాజెక్టు చేయాల్సి ఉంది. రష్మిక పుష్ప 2, రెయిన్ బో, ది గర్ల్ ఫ్రెండ్‌ సినిమాలతో పాటు హిందీలో ‘ఛవా’ అనే సినిమా చేస్తున్నారు.