Vijay Deverakonda
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇద్దామని రెడీగా ఉన్నాడు. జులై 31న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజయిన సాంగ్స్, టీజర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాతో విజయ్ సూపర్ హిట్ కొడతాడని ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ చేయాల్సిన సమయంలో విజయ్ హాస్పిటల్ లో చేరాడని వార్తలు వస్తున్నాయి.
Also Read : Junior : ‘జూనియర్’ మూవీ రివ్యూ.. జెనీలియా రీ ఎంట్రీ సినిమా ఎలా ఉందంటే..?
విజయ్ దేవరకొండ డెంగ్యూ బారిన పడ్డాడని, అందుకే హాస్పిటల్ లో చేరాడని, ప్రస్తుతం హాస్పిటల్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం. విజయ్ ఫ్యామిలీ కూడా అతనితో పాటే హాస్పిటల్ లో సపోర్ట్ గా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై విజయ్ కానీ, విజయ్ ఫ్యామిలీ కానీ స్పందించలేదు. ఫ్యాన్స్ మాత్రం విజయ్ దేవరకొండ త్వరగా కోలుకొని కింగ్డమ్ ప్రమోషన్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు.