Rowdy Janardhan
Rowdy Janardhan : విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో వచ్చి పర్వాలేదనిపించారు. ప్రస్తుతం విజయ్ రౌడీ జనార్దన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2026 సమ్మర్ తర్వాత రిలీజ్ అవుతుందని సమాచారం. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో భారీగా తెరకెక్కుతుంది ఈ సినిమా. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.(Rowdy Janardhan)
ఇటీవల అక్టోబర్ లోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. రౌడీ జనార్దన్ టీజర్ డిసెంబర్ 18 రిలీజ్ అవుతుందని, ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేస్తారని వార్తలు వచ్చాయి. మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించకపోయినా మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇంత ఫాస్ట్ గా టీజర్ రిలీజ్ చేస్తున్నారు అని విజయ్ ఫ్యాన్స్ సంతోషించారు. అయితే చివరి నిమిషంలో ఈ టీజర్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.
రౌడీ జనార్దన్ టీజర్ రిలీజ్ వాయిదా పడింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం పలు కారణాలతో ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడింది. డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 కి డేట్ మారినట్టు తెలుస్తుంది. రౌడీ జనార్దన్ టీజర్ డిసెంబర్ 22 న గ్రాండ్ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ చేస్తారని సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. దీంతో టీజర్ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.