Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. మూడు రోజుల్లోనే కింగ్డమ్ సినిమా ఏకంగా 67 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే కింగ్డమ్ సినిమా కేవలం తెలుగు, తమిళ్, హిందీ వెర్షన్స్ లోనే రిలీజయింది. సౌత్ లో కర్ణాటక, కేరళలో కన్నడ, మలయాళం కాకుండా ఈ వెర్షన్స్ నే రిలీజ్ చేసారు.
కేరళలో కింగ్డమ్ తమిళ్, తెలుగు వర్షన్ మాత్రమే రిలీజ్ చేసారు. మలయాళం వర్షన్ లేకపోయినా అక్కడి ప్రేక్షకులు కింగ్డమ్ సినిమాకు తరలి వస్తున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కేరళలో ఓ రికార్డ్ సాధించాడు. మలయాళం వర్షన్ రిలీజ్ చేయకుండా కేరళలో తన సినిమాతో ఏకంగా ఒక కోటి రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసాడు.
Also Read : Sukumar : కూతురు నేషనల్ అవార్డు గెలవడంపై సుకుమార్ ఎమోషనల్ పోస్ట్.. ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అంటూ..
కేరళలో నాన్ మలయాళ వెర్షన్ లో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఏకైక తెలుగు సినిమాగా కింగ్డమ్, ఏకైక హీరోగా విజయ్ దేవరకొండ రికార్డ్ క్రియేట్ చేసారు. కేరళలో కింగ్డమ్ సినిమాకు వస్తున్న వసూళ్లు తమను సర్ ప్రైజ్ చేస్తున్నాయని ఇటీవల నిర్మాత నాగవంశీ చెప్పారు. విజయ్ నాన్ మలయాళం వర్షన్ తో కోటి రూపాయలు కలెక్ట్ చేసి ఇలా సరికొత్త రికార్డ్ సెట్ చేసాడు.
Also Read : Athadu : రీ రిలీజ్ లో మహేష్ మరోసారి రికార్డ్.. రిలీజ్ కి ముందే ‘అతడు’ కలెక్షన్స్ సునామీ..