Site icon 10TV Telugu

Kingdom twitter review : ‘కింగ్‌డ‌మ్‌’ ట్విట్టర్ రివ్యూ.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖాతాలో హిట్ ప‌డిందా..

Vijay Deverakonda Kingdom twitter review

Vijay Deverakonda Kingdom twitter review

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన మూవీ కింగ్ డ‌మ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. భాగ్య శ్రీ బోర్సే కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందించారు. స‌త్య‌దేవ్, వెంక‌టేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ చిత్రం నేడు (జూలై 31 గురువారం) ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఇప్ప‌టికే ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ అభిప్రాయాల‌ను తెయ‌లిజేస్తున్నారు. ఇప్ప‌టికే యూఎస్‌లో ప్రీమియ‌ర్ షో చూసిన వాళ్ల నుంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. సూరి పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ అద‌ర‌గొట్టాడ‌ని అంటున్నారు. ముఖ్యంగా జైలు సీన్స్‌, బోట్ సీక్వెన్స్ చిత్రానికే హైలెట్ అని అంటున్నారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ఆస్తులు 100 కోట్లు.. కోటి రూపాయల ఖరీదైన కారు.. ఇంకా..

ఫస్టాప్‌ ఎంత బలంగా ఉందో దానికి మించి సెకండాఫ్ ఉందని అంటున్నారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అదిరిపోయింద‌ని అంటున్నారు. స‌త్య‌దవ్‌, విజ‌య్ ల మ‌ధ్య స‌న్నివేశాలు చాలా బాగున్నాయ‌ని చెబుతున్నారు. మొత్తానికి ఇదొక ఎమోష‌న్ బ్లాక్ బాస్ట‌ర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version