Salman Khan: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ ఆస్తులు 100 కోట్లు.. కోటి రూపాయల ఖరీదైన కారు.. ఇంకా..
సల్మాన్‌ను రక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆయన కోసం బుల్లెట్ తీసుకోవడానికి కూడా రెడీ అని షేరా ఓ సందర్భంలో తెలిపారు.

Salman Khan: సల్మాన్ ఖాన్ దేశంలోని అతిపెద్ద స్టార్లలో ఒకరు. ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా బాగా ప్రాచుర్యం పొందారు. ఉదాహరణకు ఆయన బాడీ గార్డ్ షేరా స్వయంగా ఒక సెలబ్రిటీ కంటే తక్కువేమీ కాదు. ఆయన ఆస్తుల విలువ ఏకంగా రూ.100 కోట్లు. అంతేకాదు రూ. 1.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌ను కూడా కలిగి ఉన్నారు. తన చివరి శ్వాస వరకు సల్మాన్ ను ఎలాగైనా కాపాడతానని హామీ ఇచ్చారు షేరా.
షేరా అసలు పేరు గుర్మీత్ సింగ్ జాలీ. 1997లో ఇండోర్‌లో సల్మాన్‌కు సెక్యూరిటీగా సోహైల్ ఖాన్ ఆయనను నియమించారు. ఆ తర్వాత సల్మాన్‌తో షేరా అనుబంధం ప్రారంభమైంది. అంతకు ముందు, దేశ పర్యటనలో హాలీవుడ్ నటుడు కీను రీవ్స్‌కు షేరా కాపలాగా ఉన్నారు. “నేను నా సొంత కంపెనీని-టైగర్ సెక్యూరిటీని స్థాపించాను. ఆ సంవత్సరం (1995) సోహైల్ భాయ్ నన్ను పిలిచారు.
సల్మాన్‌తో పాటుగా షోలు, అన్నింటికి వెళ్లాలని నన్ను కోరారు. నేను మాట్లాడే విధానం చూసి సోహైల్ భాయ్ అట్రాక్ట్ అయ్యారు. మీరు భాయ్ తో ఉంటారా? అని సోహైల్ నన్ను అడిగారు. అంతే, అలా డీల్ కుదిరింది. ఆ సమయంలో నేను టర్బన్ ధరించే వాడిని. నేను సిక్కుని. అయితే నా జాబ్ కారణంగా టర్బన్ వదిలివేయాల్సి వచ్చింది. పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. అందుకే టర్బన్ సాధ్యం కాలేదు. అందుకే నేను నా జట్టుని కత్తిరించుకున్నా. ఆ తర్వాత క్యాప్ ధరించడం ప్రారంభించాను” అని గుర్మీత్ సింగ్ జాలీ తెలిపారు.
సల్మాన్‌ను రక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆయన కోసం బుల్లెట్ తీసుకోవడానికి కూడా రెడీ అని షేరా ఓ సందర్భంలో తెలిపారు. సల్మాన్ కు షేరాపై చాలా నమ్మకం ఉంది. అన్ని విషయాల్లో షేరాను బాగా నమ్ముతారు.
Also Read: ‘కింగ్డమ్’ థియేట్రికల్ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..