Kingdom : ‘కింగ్డమ్’ థియేట్రికల్ రిలీజ్ బిజినెస్.. హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..
టాలీవుడ్ సమాచారం ప్రకారం కింగ్డమ్ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్..

Kingdom
Kingdom : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రేపు జులై 31న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అయితే విజయ్ గత సినిమాలు ఆశించినంత ఫలితం రాకపోయినా థియేట్రికల్ బిజినెస్ మాత్రం బాగానే జరిగింది. కింగ్డమ్ సినిమా దాదాపు 130 కోట్లు బడ్జెట్ తో విజయ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించారు.
టాలీవుడ్ సమాచారం ప్రకారం కింగ్డమ్ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్..
నైజాం – 15 కోట్లు
ఆంధ్ర – 15 కోట్లు
సీడెడ్ – 6 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 7.5 కోట్లు
ఓవర్సీస్ – 10 కోట్లు బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది.
అంటే కింగ్డమ్ సినిమా మొత్తం వరల్డ్ వైడ్ 53.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా హిట్ అవ్వాలంటే 55 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. అంటే ఆల్మోస్ట్ 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావాలి. ఓపెనింగ్ బుకింగ్స్ క్రేజ్, సినిమాపై ఉన్న హైప్, వేరే సినిమాలు ఏమి లేకపోవడంతో ఈజీగానే బ్రేక్ ఈవెన్ అయి హిట్ కొడుతుందని భావిస్తున్నారు.
Also Read : Nivita : పవన్ కళ్యాణ్ కోసం క్లోజ్ రిలేటివ్ తో గొడవ పెట్టుకున్నా.. రోడ్ మీద కార్ దిగేసి వెళ్ళిపోయా..