Pawan Kalyan – Vijay Deverakonda : ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో ‘కింగ్డమ్’.. ఫొటో వైరల్.. పవర్ స్టార్ లుక్ అదిరిందిగా..
తాజాగా కింగ్డమ్ సినిమా యూనిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్ లో కలిశారు.

Pawan Kalyan - Vijay Deverakonda
Pawan Kalyan – Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా రేపు జులై 31న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా కింగ్డమ్ సినిమా యూనిట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ సెట్ లో కలిశారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది. శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
Also See : మహేష్ బాబు ‘అతడు’ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ భోర్సే, నిర్మాత నాగవంశీ ఉస్తాద్ షూటింగ్ సెట్ కి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్, శ్రీలీలతో కలిసి ఫొటో దిగారు. విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ తో కలిసి కనిపించడంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పవర్ స్టార్ బ్లాక్ & బ్లాక్ డ్రెస్ లో సరికొత్త లుక్స్ తో అదరగొట్టాడు. దీంతో ఈ లుక్ చూసి పవన్ ఫ్యాన్స్ కూడా సంతోషిస్తున్నారు.