Vijay Deverakonda : పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ.. దర్శకుడు ఎవరో తెలుసా..?
మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. 19's కాలంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా..

Vijay Deverakonda movie with periodic action drama story
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇటీవల ‘ఖుషి’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. హిట్ టాక్ తెచుకున్నప్పటికీ కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వలేకపోయింది. ఇక ఆ ముందు వచ్చిన ‘లైగర్’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’, డియర్ కామ్రేడ్’ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి ప్లాప్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. నిజం చెప్పాలంటే 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ సినిమా తరువాత విజయ్ కి మళ్ళీ హిట్ అందలేదు.
అయినాసరి విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నిర్మాతలు, దర్శకులు విజయ్ తో సినిమాలు చేసేందుకు సిద్దమవుతూనే ఉంటున్నారు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీ రాయలసీమ ప్రాంతంలో 90’s కాలంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతుందట. ఇక ఈ సినిమాని ‘రాహుల్ సాంకృత్యాయన్’ డైరెక్ట్ చేయబోతున్నాడు. చివరిగా విజయ్ కి హిట్ ఇచ్చింది ఈ దర్శకుడే. రిలీజ్ కి ముందు నెట్టింట లీక్ అయినాసరి టాక్సీవాలాతో మంచి హిట్టుని అందించాడు రాహుల్.
Also read : RRR : ఇండియా గురించి అమెరికన్స్‌కి.. ఆర్ఆర్ఆర్ మూవీ తెలియజేసింది.. అమెరికా అధికారి
ఈ మూవీ తరువాత రాహుల్.. నానితో ‘శ్యామ్ సింగరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించాడు. 90’s టైం స్క్రీన్ ప్లేతో, గుండెకు హత్తుకునే ప్రేమ కథతో.. రాహుల్ శ్యామ్ సింగరాయ్ ని నడిపిన తీరు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు విజయ్ తో కూడా 90’s సినిమా కావడం, అది కూడా యాక్షన్ డ్రామా అవ్వడంతో అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. 2024 నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందట. విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్, VD12 సినిమాల్లో నటిస్తున్నాడు.